సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు - భక్తులకు కనువిందు అంతరించిపోతున్న పిచ్చుకలు మళ్లీ కనువిందు చేస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు దర్శనమిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని చెట్లు, గోపురాలపై వందల సంఖ్యలో పిచ్చుకలు చేరి కిచకిచమంటూ చేస్తున్న సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం కోసం గుంపులుగా తిరుగుతున్న పిచ్చుకల దృశ్యాలు చూపరులను అలరిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం లేని పరిసరాలు ఉండటంతో పిచ్చుకలు ఇక్కడకు చేరుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్న తరుణంలో సంగమేశ్వరం ఆలయం వద్ద వాటి సందడి పక్షి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు - భక్తులకు కనువిందు అంతరించిపోతున్న పిచ్చుకలు మళ్లీ కనువిందు చేస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు దర్శనమిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని చెట్లు, గోపురాలపై వందల సంఖ్యలో పిచ్చుకలు చేరి కిచకిచమంటూ చేస్తున్న సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం కోసం గుంపులుగా తిరుగుతున్న పిచ్చుకల దృశ్యాలు చూపరులను అలరిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం లేని పరిసరాలు ఉండటంతో పిచ్చుకలు ఇక్కడకు చేరుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్న తరుణంలో సంగమేశ్వరం ఆలయం వద్ద వాటి సందడి పక్షి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
- విద్యుత్ బిల్లుల చెల్లింపులో పాత ERO విధానాన్ని కొనసాగించాలి : పిక్కిలి వెంకటేశ్వర్లు డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలని, అదనపు విద్యుత్ యూజర్ చార్జీలు రద్దు చేసి పాత ERO విధానాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈ శ్రీనివాసులు కు పాత ERO విధానాన్ని పునరుద్ధరించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.1
- సాగునీటిని వెంటనే విడుదల చేయాలి రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. శిల్పా అంటేనే మహానంది మండలం.. క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా .. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.3
- రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* 👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.1
- బిజెపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేసినది.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ వెల్లడి.. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి పట్టణ కార్యదర్శి జి.రామాంజనేయులు మార్పు కావాలి,మార్పు రావాలి అనే నినాదంతో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ హాజరై ధర్నాకు వచ్చిన రైతు కూలీలను చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గౌరవనీయులు బిజెపి ప్రభుత్వాన్ని నడిపే రథసారథి నరేంద్ర మోడీ అభివృద్ధిపై దృష్టి సారించక పేదల నడ్డి విరుస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై మాటలతో నిప్పుల వర్షం కురిపించారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎన్నికల అప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏమని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులు పెరిగిపోతారు.. అదే మీరు బిజెపికి ఓటు వేసి గెలిపిస్తే నేను గెలిచాక మీకు రెండు కోట్లకు దగ్గర దగ్గర ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులను లేకుండా చేస్తాను. చూసి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి అంటూ ఆనాడు ఆయన మాట్లాడారు. మరి ఈనాడు అధికారంలోకి బిజెపి ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు అభివృద్ధి మాత్రం సున్నా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. పేదలు కనీసం మూడు పూటలు అన్నం మెతుకులు తినలేని పరిస్థితి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతసేపు డీఎస్సీ పైనే చొరవ చూపుతుంది. అవి కూడా డీఎస్సీ ఉద్యోగాలు కొందరికే. లక్షల మంది బిఈడి చదివిన విద్యార్థులు ఎందరో నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారు. లక్షల ఉద్యోగులు ఇతర శాఖలో ఉన్నాయి మరి ఆ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుస్తారు వారికే అర్థం కావడం లేదు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులపై శ్రద్ధ వహించి లక్షలలో ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించి. నష్టపోయిన ప్రతి రైతుకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా రైతు కూలీలకు పని కల్పించి రైతు కూలీలను ఆదుకోవాలి. నిరుద్యోగం అనే పదం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ పత్రిక ద్వారా అటు కేంద్ర ప్రభుత్వంకు ఇటు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రైతుల పక్షాన నిలబడి నిరుద్యోగుల పక్షాన నిలబడి సిపిఐ పార్టీ వారికి అండగా ఉండి ఉద్యమాలు కొనసాగిస్తాం అంటూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, సిపిఐ యువ నాయకుడు శివ శంకర్ గౌడ్ చేనేత కార్మికులు రైతులు, రైతు కూలీలు మహిళలు పాల్గొన్నారు.1
- మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు4
- రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.1
- బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.2
- సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు - భక్తులకు కనువిందు అంతరించిపోతున్న పిచ్చుకలు మళ్లీ కనువిందు చేస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు దర్శనమిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని చెట్లు, గోపురాలపై వందల సంఖ్యలో పిచ్చుకలు చేరి కిచకిచమంటూ చేస్తున్న సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం కోసం గుంపులుగా తిరుగుతున్న పిచ్చుకల దృశ్యాలు చూపరులను అలరిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం లేని పరిసరాలు ఉండటంతో పిచ్చుకలు ఇక్కడకు చేరుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్న తరుణంలో సంగమేశ్వరం ఆలయం వద్ద వాటి సందడి పక్షి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తోంది.1