logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రోడ్డెక్కిన రైతన్నలు ధాన్యం కొనుగోలు నిలిచిపోయిందంటూ లంకపల్లి హైవేపై ధాన్యం పోసి నిరసన పెనుబల్లి లంకపల్లిలో ట్రాఫిక్ స్తంభన_ ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆవేదనతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ రైతులు శనివారం రోడ్డెక్కారు. కల్లాలో పోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ హైవేపై ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. గత 20 రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ధాన్యం తడిసిపోతుందనే భయంతో గుండెలు చేతిలో పట్టుకొని జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా హైవేపై ధాన్యం పోయడంతో ప్రధాన రహదారిపై లారీలు, కార్లు, బస్సులు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. *కొనుగోళ్లలో జాప్యం రైతును కలవరపెడుతోంది* ప్రతి సీజన్‌లో కొనుగోళ్ల జాప్యం, సెంటర్లలో తూకం నెమ్మదించడం రైతులను నిత్యం కలవరపెడుతున్న సమస్య. వర్షాలు, గాలి దుమారాలు వంటి వాతావరణ మార్పుల నేపథ్యంలో ధాన్యం చెడిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది కొరత, టార్పాలిన్లు, బస్తాల కొరత, రవాణా సమస్యలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతపై హామీలు ఇచ్చినా, గ్రౌండ్ లెవెల్‌లో అమలులో జాప్యం జరుగుతుండడం రైతుల ఆందోళనకు దారితీస్తోంది. ఎమ్మెల్యేలు, అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

2 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అందరూ ఎలా ఉన్నా... మనం నీతిగా, నిజాయితీగా ఉండటమే ముఖ్యం
    1
    అందరూ ఎలా ఉన్నా... మనం నీతిగా, నిజాయితీగా ఉండటమే ముఖ్యం
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    37 min ago
  • Post by Sandepogu joji
    1
    Post by Sandepogu joji
    user_Sandepogu joji
    Sandepogu joji
    Farmer క్రోసూరు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by గెద్దాడ ఈశ్వర్
    3
    Post by గెద్దాడ ఈశ్వర్
    user_గెద్దాడ ఈశ్వర్
    గెద్దాడ ఈశ్వర్
    గోపాలపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • తీవ్ర సూర్యరశ్మి కారణంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న ఎలక్ట్రిక్ డీపీ (పెట్టె)లు అధిక వేడిని సంతరించుకుంటున్నాయి. దీనివల్ల ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద వాహనాలను నిలపకుండా, ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    1
    తీవ్ర సూర్యరశ్మి కారణంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న ఎలక్ట్రిక్ డీపీ (పెట్టె)లు అధిక వేడిని సంతరించుకుంటున్నాయి. దీనివల్ల ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద వాహనాలను నిలపకుండా, ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించుకోవాలని కోరుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.