logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఒడిశా నుంచి గోవాకు గంజాయి తరలింపు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు! 22 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్‌.. రూ.24 లక్షల విలువైన వాహనం, వస్తువులు సీజ్‌ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, పోచారం: ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమ్నంపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్‌ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బలెనో కారును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ, అవినాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి రవాణా వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌, పరారీలో ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

1 hr ago
user_Kommidi shiva krishna Reddy
Kommidi shiva krishna Reddy
Farmer ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
1 hr ago
cebcf61d-a03a-4f63-ba3e-5f4292099d65

ఒడిశా నుంచి గోవాకు గంజాయి తరలింపు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు! 22 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్‌.. రూ.24 లక్షల విలువైన వాహనం, వస్తువులు సీజ్‌ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, పోచారం: ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమ్నంపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పద్మనాభస్వామి

8deba368-b7b0-44bf-a280-f0ac1524a047

ఆలయ ఆర్చ్‌ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బలెనో కారును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ, అవినాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.24

లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి రవాణా వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌, పరారీలో ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. *సూర్యాపేట జిల్లా..* సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుంది.. ఈ ప్రభుత్వం పాలన తీరు.. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా.. పంటలు ఎండబెడుతుండ్రు.. ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి.. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుంది.. పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నరు.. మీడియా సంస్థలు మీ విలేకరులను గ్రామాలలో తిప్పి సమాచారం తెలుసుకోండి.. ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపే ప్రయత్నం చేయండి.. రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదు.. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు.. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది.. ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు.. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు.. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం.. మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలి.. 24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయి.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా.. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయం.. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా.. మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది.. లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన, రైతుల పక్షాన BRS పోరాటం తప్పదు..
    3
    పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి..  రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి..

*మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..*

రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే..

ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్..

కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు..

అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి..

*సూర్యాపేట జిల్లా..*
సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి..  రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి..
*మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..*
రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే..
ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్..
కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు..
అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి..
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుంది.. ఈ ప్రభుత్వం పాలన తీరు..
నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా.. పంటలు ఎండబెడుతుండ్రు..
ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి..
రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుంది..
పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నరు..
మీడియా సంస్థలు మీ విలేకరులను గ్రామాలలో తిప్పి సమాచారం తెలుసుకోండి..
ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపే ప్రయత్నం చేయండి..
రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదు.. 
రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు..
ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది..
ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు..
ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు..
కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం..
మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలి..
24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి..
కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయి..
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా..
ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయం..
కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా..  
మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా..
ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది..
లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన, రైతుల పక్షాన BRS పోరాటం తప్పదు..
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    1
    వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం 
వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong
    1
    రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో...
#bcrajyadhikarayathra #relareganga #newsong
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    20 hrs ago
  • సూరంపల్లి 110 ఎకరాల వరి పంట కాపాడడం కోసం వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేయాలి సూరంపల్లి సర్పంచ్ మైలారం పోచయ్య ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పణ టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామ రైతులకు వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఫోట్ట దశకు వచ్చిన వరిని కాపాడాలని రైతులు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కుఆ గ్రామసర్పంచ్ రైతులు లతో కవలిసి సర్పంచ్ మైలారంపోచయ్యడిఆర్ఓకు అంబదాస్ రాజేశ్వరి శ్వర్ కు వినతిపత్రం సమర్పించారు
    1
    సూరంపల్లి 110 ఎకరాల వరి పంట కాపాడడం కోసం వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేయాలి సూరంపల్లి సర్పంచ్ మైలారం పోచయ్య ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పణ 
టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామ రైతులకు వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఫోట్ట దశకు వచ్చిన వరిని కాపాడాలని రైతులు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కుఆ గ్రామసర్పంచ్ రైతులు లతో కవలిసి సర్పంచ్ మైలారంపోచయ్యడిఆర్ఓకు అంబదాస్ రాజేశ్వరి శ్వర్ కు వినతిపత్రం సమర్పించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    29 min ago
  • బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గo:- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గo:-
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు.
ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    1
    జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    1
    ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు
చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. *_NH-44పై రోడ్డు ప్రమాదం.. మాజీ ఇరిగేషన్ అధికారి బీసన్నకు తీవ్ర గాయాలు..!_* *_ప్రమాద స్థలంలో 108 అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు..!_* *_బీసన్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జోగుల రవి_* _పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సమాచారం._ _ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, అదే మార్గంలో వెళ్తున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, అలంపూర్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి స్పందించారు. వెంటనే తన సొంత వాహనంలో గాయపడిన బీసన్నను తీసుకుని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు._ _అనంతరం ఆసుపత్రి వైద్యులను కలిసి బీసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జోగుల రవి, బీసన్నకు అవసరమైన వైద్యం తక్షణమే అందించి, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులను కోరారు._ *_ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన జోగుల రవి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు._*
    1
    మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు..
మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు..
*_NH-44పై రోడ్డు ప్రమాదం.. మాజీ ఇరిగేషన్ అధికారి బీసన్నకు తీవ్ర గాయాలు..!_*
*_ప్రమాద స్థలంలో 108 అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు..!_*
*_బీసన్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జోగుల రవి_*
_పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సమాచారం._
_ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, అదే మార్గంలో వెళ్తున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, అలంపూర్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి స్పందించారు. వెంటనే తన సొంత వాహనంలో గాయపడిన బీసన్నను తీసుకుని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు._
_అనంతరం ఆసుపత్రి వైద్యులను కలిసి బీసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జోగుల రవి, బీసన్నకు అవసరమైన వైద్యం తక్షణమే అందించి, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులను కోరారు._
*_ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన జోగుల రవి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు._*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.