Shuru
Apke Nagar Ki App…
రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
Venkata Ramana Murthy K
రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లాలో రొయ్యల సాగును చావు దెబ్బ తీస్తున్న ఎల్నినో ప్రభావం ఎల్నినో.. వ్యవసాయ రంగంపైనే కాకుండా రొయ్యల పెంపకంపైనా ప్రభావం చూపుతోంది. లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్న సాగు అధిక ఉష్ణోగ్రతల వల్ల నష్టాల బాట పడుతోంది. గతేడాదితో పోలిస్తే.. ఎకరా విస్తీర్ణంలో పెంచాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు అధికంగా పెట్టాల్సిన పరిస్థితి ఈ ఏడాది నెలకొందని రొయ్యల పెంపకందారులు వాపోతున్నారు.ఎల్నినో ప్రభావoతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదు కావడం, సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా తగ్గిపోవడంతో చెరువుల్లో నీటి నాణ్యత దెబ్బతిని, సాధారణంగా 4.2 శాతం వరకు ఉండాల్సిన ఆక్సిజన్ స్థాయి 3.5 శాతానికి పడిపోతోంది. దీని వల్ల ఒక్కో సారి రొయ్యలు చనిపోతున్నాయని,ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నామని గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెరువుల యజమానులు వాపోతున్నారు.జిల్లాలో 2500 ఎకరాల మేర సాగుచేస్తున్నారు. వాతావరణ పరిస్థితిలో మార్పుల వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి తగ్గించుకున్నారు1
- ప్రతిఒక్కరం తమ భాద్యతగా పర్యావరణ పరిరక్షణ కు పాటుపడదాం పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడదాం సంతకవిటి, ఆగష్24, షురూ సంతకవిటి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ సభ్యులు టివి రమణ మూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గుడ్డ సంచులను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటివి రమణమూర్తి (బుస్కీ మాస్టర్)తో పాటు కోటగిరి నారాయణరావు దాసరి అమర్నాథ్ పులప హరిబాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, గట్టి తిరుమల రావు, సంతకవిటి మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ భాస్కర రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సాయి ఈశ్వరి, సంతకవిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాలరావు, వికాస తరంగిణి సభ్యులు విష్ణుపాత్రుని. శ్రీనివాసరావు. లావేటి. గోవిందరావు, అమనాన శ్రీనివాసరావు, పర్యావరణ ప్రేమికుడు రెడ్డి . శ్రీనివాసరావు కళాశాల, ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ లో పాల్గొన్నారు. వీరి సమక్షంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన చర్చలో ఉత్తమ ప్రతిభను చూపిన ముగ్గురు విద్యార్థినులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు తో పాటు సర్టిఫికెట్లు, కన్సోలేషన్స్ అందజేయడమైనది.1
- రాజాంలో లోలుగు సుశీల ఫౌండేషన్ సేవలు చేస్తున్న దృశ్యం ఒక్క సారి అభినందనలు తెలియచేయండి2
- నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విజయనగరం, పార్వతిపురం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా నుండి 4-10 వ తరగతుల 120 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు. ప్రదర్శనను ఎంఈఓ లు సూర్యనారాయణమూర్తి, త్రినాధ రావు, స్థానికులు తదితరలు తిలకించి విద్యార్థులను అభినందించారు.1
- విజయనగరం : సహా మూవీలో మొదటి పరిచయం హీరోయిన్గా శ్వేత లక్ష్మణ్.. విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ.. కాయని శ్రీవల్లి కుమార్తె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు సహా అనే పాత్రలో హీరోయిన్గా.. *సహా* మూవీ లో మొదటి పరిచయం హిరోయిన్ గా *శ్వేత లక్ష్మణ్* విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ, గాయిని శ్రీవల్లి కుమార్తె . చిన్న చిన్న ప్రాత్రలు చేస్తూ ఇప్పుడు "సహ " అనే పాత్ర లో హీరయిన్ గా నటించింది. సహ మూవీ టీమ్ విజయనగరం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించరు. పెద్ది సినిమా లో హీరయిన్ ఫ్రెండ్ గా నటించిన శ్వేత లక్ష్మణ్ ఇప్పుడు "సహ" మూవీ లో మొదటి పరిచయం హీరయిన్ గా దెబ్యూ మూవీ ను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నామని అందరూ ఆదరించాలని కోరారు. ఈవెంట్ లో సత్య కాలేజీ డైరెక్టర్ మజ్జి శశి భూషణం రావు,సముద్రపు రామారావు పాల్గొన్నారు విజయనగరం లో డాన్స్ మాస్టర్స్, విజయనగరం అమ్మాయి హీరయిన్ అవటం చాలా సంతోషం అని మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రావణి అన్నారు.1
- బ్రేక్ ఫెయిల్‌తో లోయలో పడిన పోలీసు వాహనం.. కానిస్టేబుల్ వెంకటరమణ మృతి విజయనగరం, ఆగస్టు 23: విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసు వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో రహదారి పక్కనున్న లోయలో పడిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం కొండకరకాం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సీర వెంకట రమణ (49)ను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ వెంకట రమణ మృతి చెందారు. ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు ప్రమాదంలో విజయనగరం రూరల్ ఎస్సై వి. అశోక్ కుమార్ ఎడమ కాలు విరగడంతో పాటు రిబ్స్, పెదవి భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ జి. నాగేంద్ర ప్రసాద్ ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరగడంతో పాటు రిబ్స్‌కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆయనను విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వాహన డ్రైవర్, ఏఆర్ కానిస్టేబుల్ కె. రాజబాబుకు నడుము భాగంలో ఎముక డిస్లోకేషన్ కావడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే తిరుమల మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత పోలీసుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతిచెందిన కానిస్టేబుల్ వెంకట రమణ కుటుంబానికి, గాయపడిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించినట్లు తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటాం: ఎస్పీ కానిస్టేబుల్ వెంకట రమణ మృతితో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విధుల్లో తమతో కలిసి పనిచేసిన పోలీసు కుటుంబంలోని ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్య కుమారి, తల్లిదండ్రులను ఎస్పీ పరామర్శించి ఓదార్చారు. వెంకట రమణ కుటుంబానికి పోలీసు శాఖ, ప్రభుత్వం అండగా ఉంటాయని భరోసా కల్పించారు. పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎస్. రాఘవులను ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పరిశీలించారు. JNTU సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ భవనం మలుపు వద్ద ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 20 అడుగుల లోతున్న గోతిలోకి పోలీసు వాహనం పడిపోయినట్లు గుర్తించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, వైద్యులను ఎస్పీ ఆదేశించారు.1
- ప్రపంచ జానపద కళాకారు దినోత్సవం సందర్భంగా ఈరోజు బొబ్బిలి వేణుగోపాలస్వామి కళ్యాణ మండపం లో సభ మరియు కళాకారు ప్రదర్శనలు నిర్వహించి బొబ్బిలి పురవీధుల్లో కళాకారులతో పలు రకాల విన్యాసాలు చెక్కభజన కోలాటం 32 రకాల కళలను ప్రదర్శించి కడు రమ్యంగా ప్రదర్శన నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకుగాను ప్రపంచ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ ను చీఫ్ గెస్ట్ అయినటువంటి బేబీ నాయనగారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగినది..4
- రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.1