logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బ్రేక్ ఫెయిల్‌తో లోయలో పడిన పోలీసు వాహనం.. కానిస్టేబుల్ వెంకటరమణ మృతి విజయనగరం, ఆగస్టు 23: విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసు వాహనం బ్రేక్‌ ఫెయిల్ కావడంతో రహదారి పక్కనున్న లోయలో పడిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం కొండకరకాం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సీర వెంకట రమణ (49)ను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ వెంకట రమణ మృతి చెందారు. ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు ప్రమాదంలో విజయనగరం రూరల్ ఎస్సై వి. అశోక్ కుమార్ ఎడమ కాలు విరగడంతో పాటు రిబ్స్, పెదవి భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ జి. నాగేంద్ర ప్రసాద్ ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరగడంతో పాటు రిబ్స్‌కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆయనను విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వాహన డ్రైవర్, ఏఆర్ కానిస్టేబుల్ కె. రాజబాబుకు నడుము భాగంలో ఎముక డిస్లోకేషన్ కావడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే తిరుమల మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత పోలీసుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతిచెందిన కానిస్టేబుల్ వెంకట రమణ కుటుంబానికి, గాయపడిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించినట్లు తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటాం: ఎస్పీ కానిస్టేబుల్ వెంకట రమణ మృతితో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విధుల్లో తమతో కలిసి పనిచేసిన పోలీసు కుటుంబంలోని ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్య కుమారి, తల్లిదండ్రులను ఎస్పీ పరామర్శించి ఓదార్చారు. వెంకట రమణ కుటుంబానికి పోలీసు శాఖ, ప్రభుత్వం అండగా ఉంటాయని భరోసా కల్పించారు. పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎస్. రాఘవులను ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పరిశీలించారు. JNTU సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ భవనం మలుపు వద్ద ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 20 అడుగుల లోతున్న గోతిలోకి పోలీసు వాహనం పడిపోయినట్లు గుర్తించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, వైద్యులను ఎస్పీ ఆదేశించారు.

23 hrs ago
user_Giridhar singh
Giridhar singh
Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
    1
    రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు
శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై  నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు

చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస
    1
    ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస
    user_DUVVADA SRIDHAR BABA
    DUVVADA SRIDHAR BABA
    Lawyer పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    1
    జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    22 hrs ago
  • వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    1
    వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి
గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    1
    పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం.. “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్‌లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్‌లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    1
    “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు.
కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..
“కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్‌లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు.
కౌన్సిల్‌లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.
ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    22 hrs ago
  • పాలకొల్లులో.. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి, మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
    3
    పాలకొల్లులో.. 
టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం
స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి,  మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • లారీ తనిఖీలో ఓవర్ టెక్ చేసి వెళ్లిన లారీ డ్రైవర్ కి బుద్ది చెప్పిన బ్రేక్ ఇన్స్పెక్టర్ *లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ దాడి* విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ తనిఖీలు చేస్తుండBగా లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్ *దీంతో లారీని ఓవర్‌టేక్ చేసి, లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్* ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు
    1
    లారీ తనిఖీలో ఓవర్ టెక్ చేసి వెళ్లిన లారీ డ్రైవర్ కి బుద్ది చెప్పిన బ్రేక్ ఇన్స్పెక్టర్ 
*లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ దాడి* 
విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ తనిఖీలు చేస్తుండBగా లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్
*దీంతో లారీని ఓవర్‌టేక్ చేసి, లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్* 
ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు
    user_Radhika
    Radhika
    Tailor భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    46 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.