logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్గొండ రామాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు నల్గొండ బ్రేకింగ్: _రెండవ భద్రాద్రిగా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధి.!_ వచ్చే వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం గోపురం ఏర్పాటు లక్ష్యం– *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ.* శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ... 4 వేల మందికి స్వంత ఖర్చులతో అన్నప్రసాదం ఏర్పాటు... మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతుల నుంచి ముత్యాల తలంబ్రాలు బాజా భజంత్రీల నడుమ ఘనంగా ఆలయానికి రాక.. వేద మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండుగగా సీతారాముల కల్యాణోత్సవం... వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహణ... దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం... దర్శన మార్గాల విస్తరణకు భూసేకరణ చర్యలు ప్రారంభం... నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభం... భక్తులకు మరింత సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబాటు... దేవాలయ భూములకు ఇబ్బంది లేకుండా నేషనల్ హైవే బైపాస్ మార్పు... నల్గొండ ప్రజలకు శ్రీరాముని కృప ఉండాలని మంత్రి ఆకాంక్ష... ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని *మేయర్* స్పష్టం.... ఉత్తర ద్వార దర్శనం కల్పనకు కృషి చేస్తామని స్పష్టం...

1 day ago
user_Journalist pk
Journalist pk
Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
1 day ago

నల్గొండ రామాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు నల్గొండ బ్రేకింగ్: _రెండవ భద్రాద్రిగా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధి.!_ వచ్చే వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం గోపురం ఏర్పాటు లక్ష్యం– *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ.* శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ... 4 వేల మందికి స్వంత ఖర్చులతో అన్నప్రసాదం ఏర్పాటు... మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతుల నుంచి ముత్యాల తలంబ్రాలు బాజా భజంత్రీల నడుమ ఘనంగా ఆలయానికి రాక.. వేద మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండుగగా సీతారాముల కల్యాణోత్సవం... వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహణ... దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం... దర్శన మార్గాల విస్తరణకు భూసేకరణ చర్యలు ప్రారంభం... నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభం... భక్తులకు మరింత సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబాటు... దేవాలయ భూములకు ఇబ్బంది లేకుండా నేషనల్ హైవే బైపాస్ మార్పు... నల్గొండ ప్రజలకు శ్రీరాముని కృప ఉండాలని మంత్రి ఆకాంక్ష... ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని *మేయర్* స్పష్టం.... ఉత్తర ద్వార దర్శనం కల్పనకు కృషి చేస్తామని స్పష్టం...

More news from తెలంగాణ and nearby areas
  • చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! ​ చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    1
    చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం!
​
చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
​అసలేం జరిగిందంటే..
వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక  వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది.
​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు  ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    4
    ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం
గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 
సిద్దిపేట జిల్లా :  గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • హైదరాబాద్‌లో ఆశా కార్యకర్తలు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుని పలువురిని అక్రమంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశాలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని, పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందని నాయకులు హెచ్చరించారు.
    3
    హైదరాబాద్‌లో ఆశా కార్యకర్తలు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుని పలువురిని అక్రమంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశాలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని, పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందని నాయకులు హెచ్చరించారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అధికారులు ముఖ్య సూచనలు చేశారు. భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా లభించే క్లెయిమ్ డబ్బుల విషయంలో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా క్లెయిమ్ డబ్బులు రావాల్సి ఉంటే, వారు తప్పనిసరిగా స్వయంగా సమీపంలోని లేబర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొంటూ, కొంతమంది బ్రోకర్లు క్లెయిమ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. “మేము చేస్తేనే డబ్బులు వస్తాయి”, “అధికారులకు డబ్బులు ఇవ్వాలి” వంటి అబద్ధపు మాటలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్ల మాటలకు మోసపడి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించారు. అదేవిధంగా, కొన్ని సందర్భాల్లో కార్మికులకు రావాల్సిన డబ్బులను వారి అకౌంట్లలో వేసుకుని, కొంత మాత్రమే ఇవ్వడం జరుగుతుందని సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బ్రోకర్లు లేదా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
    1
    నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అధికారులు ముఖ్య సూచనలు చేశారు. భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా లభించే క్లెయిమ్ డబ్బుల విషయంలో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా క్లెయిమ్ డబ్బులు రావాల్సి ఉంటే, వారు తప్పనిసరిగా స్వయంగా సమీపంలోని లేబర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు పేర్కొంటూ, కొంతమంది బ్రోకర్లు క్లెయిమ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. “మేము చేస్తేనే డబ్బులు వస్తాయి”, “అధికారులకు డబ్బులు ఇవ్వాలి” వంటి అబద్ధపు మాటలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్ల మాటలకు మోసపడి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించారు.
అదేవిధంగా, కొన్ని సందర్భాల్లో కార్మికులకు రావాల్సిన డబ్బులను వారి అకౌంట్లలో వేసుకుని, కొంత మాత్రమే ఇవ్వడం జరుగుతుందని సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా బ్రోకర్లు లేదా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు: బాలయోగి కృష్ణ మహారాజు లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి ఈ యాత్రలో పాల్గొని కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు. ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
    1
    పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. 
శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది.
పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది.
ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు.
ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు:
బాలయోగి కృష్ణ మహారాజు  లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు.
ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి  ఈ యాత్రలో పాల్గొని  కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు.
ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
  • కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్‌ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.
    1
    కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు.
హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్‌ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.
    1
    ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    26 min ago
  • "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.
    1
    "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    3
    జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.