Shuru
Apke Nagar Ki App…
MLAఅమర్నాథరెడ్డి పలు ప్రారంభోత్సవ,శంకుస్థాపన కార్యక్రమాలు 27/3/2026 శుక్రవారం పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి PKMUDA వారిచే మంజూరైన నిధులతో సిల్క్ ఫారం, గంటా ఊరు-2, నీళ్లకుంట, బాసిరెడ్డి పల్లె వద్ద నూతన బోర్వెల్స్ ను ప్రారంభించడం అయినది. గంటవురు పరిధిలో నూతనంగా నిర్మించబడిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను, SVCRడిగ్రీ కళాశాల వద్ద మంచినీటి పంపు కొరకు భూమిపూజ జరిగింది. బాపూజీ ఉద్యానవనం, దినసరి కూరగాయల మార్కెట్ నందు నూతనముగా నిర్మించనున్న మరుగుదొడ్లకు భూమి పూజ. మొత్తం₹1.73 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డిఓ భవాని, కమిషనర్ రమణారెడ్డి తదితర అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
S Abdul suban
MLAఅమర్నాథరెడ్డి పలు ప్రారంభోత్సవ,శంకుస్థాపన కార్యక్రమాలు 27/3/2026 శుక్రవారం పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి PKMUDA వారిచే మంజూరైన నిధులతో సిల్క్ ఫారం, గంటా ఊరు-2, నీళ్లకుంట, బాసిరెడ్డి పల్లె వద్ద నూతన బోర్వెల్స్ ను ప్రారంభించడం అయినది. గంటవురు పరిధిలో నూతనంగా నిర్మించబడిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను, SVCRడిగ్రీ కళాశాల వద్ద మంచినీటి పంపు కొరకు భూమిపూజ జరిగింది. బాపూజీ ఉద్యానవనం, దినసరి కూరగాయల మార్కెట్ నందు నూతనముగా నిర్మించనున్న మరుగుదొడ్లకు భూమి పూజ. మొత్తం₹1.73 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డిఓ భవాని, కమిషనర్ రమణారెడ్డి తదితర అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకండి- టిడిపి నాయకులు కోవూరు పివిఆర్ కళ్యాణ మండపంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా నిన్న వైసీపీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై మీడియా సమావేశంలో విమర్శలు చేసిన విషయంపై కోవూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమని అక్రమ కట్టడాలను తొలగించడం పై మాట్లాడుతూ ఆ కట్టడాలలో ఉన్నవారికి ఇల్లు మంజూరు చేయడం జరిగిందని ప్రజా సంక్షేమం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వైసిపి నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై ఎమ్మెల్యే పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రజల కోసమే చేస్తామని వైసీపీ ప్రభుత్వంలో ని కోవూరులోని వైసిపి నాయకులు ఎన్ని ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు మాకు తెలుసని ప్రజలను మోసం చేసి ఈరోజు నలుగురు వ్యక్తులను వెంట వేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ గోపిరెడ్డి , జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.3
- శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు…. ThankYou @ATPPOLICE @naralokesh @ncbn @ APPOLICE100 @dgp_ap 👏 #JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed1
- మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.1
- రాయదుర్గం మండలం బానేపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ రథం ఊరేగింపుగా సాగగా, గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు చేశారు.కార్యాలయ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసారు. ఈసీ, రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ను కలవాలని మధ్యవర్తులను కలవాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్టర్ లో హెల్ప్ లైన్ డెస్క్ పెట్టాలని సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు. సంబంధిత ఈసీ, ఆర్ హెచ్చ్ తదితర సేవలకు రేట్లను కనిపించే విధంగా బోర్డు పెట్టాలని సూచించారు.రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీచేశారు.2
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు: బాలయోగి కృష్ణ మహారాజు లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి ఈ యాత్రలో పాల్గొని కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు. ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.1
- జనగామ జిల్లా :- జనగామ పాలకుర్తి రోడ్ పై డీసీఎం బోల్తా డ్రైవర్ మృతి... లింగాల ఘనపూర్ మండలం చిటూరు గ్రామం అప్పిరెడ్డి పల్లి క్రాస్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది... మొక్క జొన్న లోడుతో వెళుతున్న డీసీఎం అతివేగం అజాగ్రత్తె ప్రమాదానికి కారణమని తెలుస్తుంది... ముల మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తా పడ్డ డీసీఎం... ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ జహిరుద్దీన్ అక్కడికక్కడే మృతి మృతుడు జహీరుద్దీన్ భువనగిరి నివాసిగా గుర్తించారు... సంమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...1
- పోలీసులు పై దాడి చేసిన కిరాతకుడు..బుల్లెట్లు దింపిన అనంతపురం పోలీసులు..హర్షం వ్యక్తం చేసిన జిల్లా ప్రజలు..పండుగ చేసుకున్న గ్రామ ప్రజలు1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు దర్శనమిచ్చాడు. శుక్రవారం సాయంకాలం ఆలయంలో ప్రత్యేక పూజలు యాగాలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవ మూర్తిని సూర్యప్రభ వాహనోత్సవం పై కొలువు తీర్చి మేళ తాళాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, పురోహితులు రామకృష్ణ పాల్గొన్నారు.1