Shuru
Apke Nagar Ki App…
గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
SHOT NEWS
గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు. అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి." బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు 1
- నల్లగొండ బ్రేకింగ్: శభాష్ పోలీస్ అన్న.. నీ ధైర్యానికి జోహార్! నల్లగొండ పట్టణంలోని ఆర్పి రోడ్ గర్ల్స్ కాలేజ్ పెట్రోల్ పంప్ వద్ద ఒకేసారి కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెల్లరేగాయి... స్థానికులు వెంటనే పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు... విధుల్లో ఉన్న *కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు* ఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి అవలీలగా ఒక కర్రతో ట్రాన్స్ఫారంపై ఎగసిపడుతున్న మంటలను ఆర్పారు... ఏ మాత్రం ఆలస్యమైన ట్రాన్స్ఫారంకు మంటలు అంటుకొనేవీ, పక్కనే పెట్రోల్ బంకుపై పడే అవకాశం ఉండే... వెంకటేశ్వర్లు ధైర్యసహసాలతో ఏమాత్రం ఆలోచించం కుండా పెద్ద ప్రమాదం సంభవించక ముందే మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది... అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటన వీడియోలు చిత్రీకరించారు.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో *శభాష్ పోలీస్ అన్న!* అంటూ నలగొండ పోలీస్ వారికి ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు... ధైర్య సాహసంతో మంటలు ఆర్పిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను వన్ టౌన్ సీఐ *ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి* అభినందించారు...1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది. ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.3
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరుకావడానికి భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘనస్వాగతం పలికారు.3
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- Post by Syyed taher1