logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే - గుడాల గోపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసిపి పాలకొల్లు ఇంచార్జ్ కూడా శ్రీహరి గోపాల్ రావు అన్నారు. ఈ విషయంపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు పాలకొల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు

5 hrs ago
user_Gopi krishna Journalist
Gopi krishna Journalist
journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే - గుడాల గోపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసిపి పాలకొల్లు ఇంచార్జ్ కూడా శ్రీహరి గోపాల్ రావు అన్నారు. ఈ విషయంపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు పాలకొల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే - గుడాల గోపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసిపి పాలకొల్లు ఇంచార్జ్ కూడా శ్రీహరి గోపాల్ రావు అన్నారు. ఈ విషయంపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు పాలకొల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు
    1
    నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే
- గుడాల గోపి
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసిపి పాలకొల్లు ఇంచార్జ్ కూడా శ్రీహరి గోపాల్ రావు అన్నారు. ఈ విషయంపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు పాలకొల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • మోడీ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన జయప్రదంగా జైల్ భరో కేంద్ర కార్మిక సంఘాల నాయకుల అరెస్టు, విడుదల కాకినాడ, మెయిన్ రోడ్ : సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో తలపెట్టిన జైల్ భరో విజయవంతం అయినట్టు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1000 కేంద్రాల్లో ఈ ప్రతిఘటన కార్యక్రమం నిర్వహించినట్లు, కాకినాడ జిల్లాలో తుని, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ, తాల్లారేవు, కాజులూరు ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద రాస్తారోకో అనంతరం పోస్ట్ ఆఫీస్ ముట్టడి నిర్వహించగా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్టు చేసి పోర్టు, త్రి టౌన్ పోలీస్ స్టేషన్ లకు ఆందోళనకారులను తరలించి అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేసారు. ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీసవేతనం నేటి ధరలకు అనుగుణంగా 31వేలు చెల్లించాలని, తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించి, బకాయి 6 డీఏలను చెల్లించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయాన్ని దివాలా తీయించే అమెరికాతో చేసుకునే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, కనీస పెంక్షన్ 9 వేలు చెల్లించాలని, ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజు వేతనం 700 చెల్లించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పంట నష్టపరిహారం ఇవ్వాలని, స్కిం వర్కర్లను, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి ఏపీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరి రాజు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్లు కాలంలో కార్మికులు ప్రభుత్వాన్ని కోరిన ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని, అదాని, అంబానీ కార్పొరేట్ కార్యాలయాల నుండి అందిన ఆదేశాలను తూచా తప్పకుండా మోడీ ప్రభుత్వం చట్టాల రూపంలో కార్మికులపై, రైతులపై రుద్దుతుందని విమర్శించారు. దేశానికి ఈ కార్పొరేట్ విధానాల నుండి విముక్తి కోసం విద్యార్థులు, కార్మికులు, రైతులు ఐక్యంగా మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్, రష్యా నుంచి చవక ఆయిల్ కొలువు కొనుగోలును మోడీ ప్రభుత్వం నిలుపుదల చేయడం దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని అమెరికాకి తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ల లాభాలకు గ్యారెంటీ చేయడం కోసమే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 4 లేబర్ కోడ్లలు తెచ్చారని, రోజుకు 176 ఇస్తే సరిపోతుందని జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించడం ఎవరి ప్రయోజనాలకని ప్రశ్నించారు. ఇప్పుడు అమెరికా ఒత్తిడి మేరకు వ్యవసాయ, డైరీ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి మోడీ ప్రభుత్వం తీసుకురావడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు. అమెరికా వీసా, మాస్టర్ ఆర్ధిక సంస్థల ఒత్తిడి మేరకు ఉచితంగా అందించే యూపీఐ సేవలపై పన్ను విధించిన విషయం ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ జిల్లా కోశాధికారి మలకా రమణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు వెంకటలక్ష్మి, చంద్రమళ్ల పద్మ, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టీ.రాజా, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, నగర అధ్యక్షులు స్వామి, జిజిహెచ్ శానిటేషన్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, తలుపులమ్మ, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, విజయ్, సెక్యూరిటీ యూనియన్ నాయకులు ధర్మా, భాగ్యలక్ష్మి, కె.దుర్గ, పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాజేంద్రప్రసాద్, సూర్యనారాయణ, పరిశ్రమల కార్మికులు బలరాం, శ్రీహరి, సత్యన్నారాయణ, ఎఐసీసీటియు నాయకులు K.కమలాకర్, S. సత్యనారాయణ, G.నాగేశ్వరరావు,K. చినబాబు, ఐఎఫ్టియు నాయకులు నరసింహ, సత్తిబాబు, స్నేహిత్, అనిల్, ప్రేమాకుమార్, ఎల్లారావు, తాత్తరావు, ఆదివిష్ణు, వడ్డీకాసుల్ మహేష్, శివ, ఐఎన్టియుసి నాయకులు బి.అశోక్ కుమార్, లోక్ పాల్, శివ, త్రిమూర్తులు, చిన్న, రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, బంగారు రాజేష్, జిజిహెచ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి N. అనిల్ కుమార్, కాటూరి రాజు, మధు, జాన్ బాబు, రంగరాయ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివ, కాటవేణి, ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కుమార్, జిల్లా అధ్యక్షులు రాజు, నిమ్మకాయలేశ్వర్రావు, జానుబాబు, కుమార్, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు
    2
    మోడీ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన
జయప్రదంగా జైల్ భరో
కేంద్ర కార్మిక సంఘాల నాయకుల అరెస్టు, విడుదల

కాకినాడ, మెయిన్ రోడ్ : సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో తలపెట్టిన జైల్ భరో విజయవంతం అయినట్టు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1000 కేంద్రాల్లో ఈ ప్రతిఘటన కార్యక్రమం నిర్వహించినట్లు, కాకినాడ జిల్లాలో తుని, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ, తాల్లారేవు, కాజులూరు ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద రాస్తారోకో అనంతరం పోస్ట్ ఆఫీస్ ముట్టడి నిర్వహించగా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్టు చేసి పోర్టు, త్రి టౌన్ పోలీస్ స్టేషన్ లకు ఆందోళనకారులను తరలించి అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేసారు.
ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీసవేతనం నేటి ధరలకు అనుగుణంగా 31వేలు చెల్లించాలని, తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించి, బకాయి 6 డీఏలను చెల్లించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయాన్ని దివాలా తీయించే అమెరికాతో చేసుకునే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, కనీస పెంక్షన్ 9 వేలు చెల్లించాలని, ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజు వేతనం 700 చెల్లించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పంట నష్టపరిహారం ఇవ్వాలని, స్కిం వర్కర్లను, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి ఏపీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరి రాజు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ,
కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్లు కాలంలో కార్మికులు ప్రభుత్వాన్ని కోరిన ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని, అదాని, అంబానీ కార్పొరేట్ కార్యాలయాల నుండి అందిన ఆదేశాలను తూచా తప్పకుండా మోడీ ప్రభుత్వం చట్టాల రూపంలో కార్మికులపై, రైతులపై రుద్దుతుందని విమర్శించారు. దేశానికి ఈ కార్పొరేట్ విధానాల నుండి విముక్తి కోసం విద్యార్థులు, కార్మికులు, రైతులు ఐక్యంగా మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్, రష్యా నుంచి చవక ఆయిల్ కొలువు కొనుగోలును మోడీ ప్రభుత్వం నిలుపుదల చేయడం దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని అమెరికాకి తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ల లాభాలకు గ్యారెంటీ చేయడం కోసమే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 4 లేబర్ కోడ్లలు తెచ్చారని, రోజుకు 176 ఇస్తే సరిపోతుందని జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించడం ఎవరి ప్రయోజనాలకని ప్రశ్నించారు. ఇప్పుడు అమెరికా ఒత్తిడి మేరకు వ్యవసాయ, డైరీ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి మోడీ ప్రభుత్వం తీసుకురావడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు. అమెరికా వీసా, మాస్టర్ ఆర్ధిక సంస్థల ఒత్తిడి మేరకు ఉచితంగా అందించే యూపీఐ సేవలపై పన్ను విధించిన విషయం ప్రజలు గమనించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ జిల్లా కోశాధికారి మలకా రమణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు వెంకటలక్ష్మి, చంద్రమళ్ల పద్మ, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టీ.రాజా, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, నగర అధ్యక్షులు స్వామి, జిజిహెచ్ శానిటేషన్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, తలుపులమ్మ, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, విజయ్, సెక్యూరిటీ యూనియన్ నాయకులు ధర్మా, భాగ్యలక్ష్మి, కె.దుర్గ, పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాజేంద్రప్రసాద్, సూర్యనారాయణ, పరిశ్రమల కార్మికులు బలరాం, శ్రీహరి, సత్యన్నారాయణ, ఎఐసీసీటియు నాయకులు K.కమలాకర్, S. సత్యనారాయణ, G.నాగేశ్వరరావు,K. చినబాబు, ఐఎఫ్టియు నాయకులు నరసింహ, సత్తిబాబు, స్నేహిత్, అనిల్, ప్రేమాకుమార్, ఎల్లారావు, తాత్తరావు, ఆదివిష్ణు, వడ్డీకాసుల్ మహేష్, శివ, ఐఎన్టియుసి నాయకులు బి.అశోక్ కుమార్, లోక్ పాల్, శివ, త్రిమూర్తులు, చిన్న, రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, బంగారు రాజేష్, జిజిహెచ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి N. అనిల్ కుమార్, కాటూరి రాజు, మధు, జాన్ బాబు, రంగరాయ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివ, కాటవేణి, ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కుమార్, జిల్లా అధ్యక్షులు రాజు, నిమ్మకాయలేశ్వర్రావు, జానుబాబు, కుమార్, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    3 hrs ago
  • నన్నయ యూనివర్సిటీలో 5వ రోజుకు చేరిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష నన్నయ యూనివర్సిటీలో 5వ రోజుకు చేరిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష టెండర్ నోటీసు రద్దు చేయాలి.. అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి రాజానగరం, ఆగస్టు 10: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నాన్‌టీచింగ్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కొనసాగించారు. గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఇటీవల జారీ చేసిన టెండర్ నోటీసును వెంటనే రద్దు చేయాలని, ఏళ్ల తరబడి అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరారు. తమ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్చలు జరిపి పరిష్కారం చూపాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఐదు రోజులుగా నిరసన కొనసాగుతున్నప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన స్పందన లేకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసన దీక్షలను కొనసాగిస్తామని నాన్‌టీచింగ్ అవుట్‌సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. దీక్షకు వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగారపు విజయబాబు, జనరల్ సెక్రటరీ వై. వీరభద్ర చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ వి.వి. రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నన్నయ యూనివర్సిటీలో 5వ రోజుకు చేరిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష
నన్నయ యూనివర్సిటీలో 5వ రోజుకు చేరిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష
టెండర్ నోటీసు రద్దు చేయాలి.. అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
రాజానగరం, ఆగస్టు 10: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నాన్‌టీచింగ్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కొనసాగించారు.
గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఇటీవల జారీ చేసిన టెండర్ నోటీసును వెంటనే రద్దు చేయాలని, ఏళ్ల తరబడి అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరారు.
తమ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్చలు జరిపి పరిష్కారం చూపాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఐదు రోజులుగా నిరసన కొనసాగుతున్నప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన స్పందన లేకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసన దీక్షలను కొనసాగిస్తామని నాన్‌టీచింగ్ అవుట్‌సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.
దీక్షకు వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగారపు విజయబాబు, జనరల్ సెక్రటరీ వై. వీరభద్ర చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ వి.వి. రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీరంగపట్నం కంబాల బంగారు కానుక మరియు పట్టు చీరలు పంపిణీ వేలాదిమంది మహిళలకు చీరలు పంపిణీ
    1
    శ్రీరంగపట్నం కంబాల బంగారు కానుక మరియు పట్టు చీరలు పంపిణీ వేలాదిమంది మహిళలకు చీరలు పంపిణీ
    user_Surisetti Rambabu
    Surisetti Rambabu
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పండితులు జన్మదిన శుభాకాంక్షలు
    1
    కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పండితులు జన్మదిన శుభాకాంక్షలు
    user_Surisetti Rambabu
    Surisetti Rambabu
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు....... మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.
    4
    అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు.......
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు.
ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.