Shuru
Apke Nagar Ki App…
విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి కమ్మర్ పల్లి: విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య పేర్కొన్నారు. మండలంలోని చౌటుపల్లి పీఎంశ్రీ జడ్పీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. 15 రోజులపాటు కొనసాగనున్న వేసవి శిక్షణ శిబిరంలో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు చదువుతోపాటు ఎంబ్రోడెరీ, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగ ఆటల కార్యకలాపాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, సర్పంచ్ మెహబూబ్, ఉప సర్పంచ్ విశాల్, వార్డ్ సభ్యులు రుక్విత్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కమల, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Rakesh goud
విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి కమ్మర్ పల్లి: విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య పేర్కొన్నారు. మండలంలోని చౌటుపల్లి పీఎంశ్రీ జడ్పీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. 15 రోజులపాటు కొనసాగనున్న వేసవి శిక్షణ శిబిరంలో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు చదువుతోపాటు ఎంబ్రోడెరీ, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగ ఆటల కార్యకలాపాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, సర్పంచ్ మెహబూబ్, ఉప సర్పంచ్ విశాల్, వార్డ్ సభ్యులు రుక్విత్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కమల, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- బాసర శివాజీ చౌక్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.1
- నిర్మల్ జిల్లా ముధోల్ విటోలి గ్రామంలో లో విషాదం ఇద్దరు బాలురు మృతి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిఖిల్(15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామం శివారులోని రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్ న క్రమంలో నిఖిల్, స్వరాజ్ నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్ న ఎస్ఐ పెర్సీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్* *రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం* *కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి* *రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* *రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం* *రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. *ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.* "ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు. "గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.1
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు1
- చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం... గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డైరీ ఫామ్ చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.2
- తెలంగాణలోని పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శుభదినం కావడంతో పాటు, వేసవి సెలవులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.1