Shuru
Apke Nagar Ki App…
గుంటూరులో పడకేసిన పారిశుధ్యం గుంటూరు నగరం: గుంటూరు మార్కెట్ సెంటర్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే ఈ వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల మార్కెట్‌కు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
SIVA
గుంటూరులో పడకేసిన పారిశుధ్యం గుంటూరు నగరం: గుంటూరు మార్కెట్ సెంటర్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే ఈ వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల మార్కెట్‌కు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు నగరం: గుంటూరు మార్కెట్ సెంటర్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే ఈ వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల మార్కెట్‌కు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.1
- గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల విరామం తర్వాత జరిగిన మెడికల్ ఎగ్జిబిషన్‌కు 42,951 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తెలిపారు. సుందరాచారి అన్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 22న ముగుస్తుంది.1
- 📍 విశాఖపట్నం తీరంలో ఈరోజు ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత సుప్రీం కమాండర్ అయిన ద్రౌపది ముర్ము యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 71 స్వదేశీ మరియు విదేశీ యుద్ధ నౌకలు పాల్గొని రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించనున్నాయి. ⚓ ప్రత్యేక ఆకర్షణగా దేశ గర్వకారణమైన స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS Vikrant నిలుస్తోంది. 🇮🇳 భారత నౌకాదళ శక్తి, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్, నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి), మరియు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. 🌊 విశాఖ తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయబడింది. భారీగా నౌకాదళ సిబ్బంది, పోలీసు బలగాలు మోహరించారు. 👉 భారత నౌకాదళ శక్తి వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఇది.1
- *ఇబ్రహీంపట్నం ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20,* *ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలోని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలను చేత పట్టుకుని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.*1
- Post by ఉంగరాల కార్తీక్1
- అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె విగత జీవిగా మారడాన్ని చూసి ఆమె కుటుంబం తల్లడిల్లింది. 10వ తరగతి విద్యార్థిని కుడిపూడి కరుణ (15) ముంగండ చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. దీంతో ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నానమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే కరుణ మృతి చెందడం మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.1
- *20/02/2026* *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు* *అనంతరం క్రీడల పతాకాన్ని ఎగరవేశారు* *ఈ సందర్భంగా క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు* *కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఖలీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు*1
- పొన్నూరులో జరిగింది గ్యాంగ్ వార్ కాదు - సీఐ.. గుంటూరు జిల్లా,పొన్నూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణను సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్ గా చిత్రీకరించడాన్ని పొన్నూరు అర్బన్ సీఐ వీరా నాయక్ ఖండించారు.. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, వెంకటేష్, ప్రతాపరెడ్డి మినీ లారీలో బాపట్లకు వెళ్తుండగా, పొన్నూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ఉదయ్ భాస్కర్, అజయ్స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘర్షణ జరిగిందని, ఇది గ్యాంగ్ వార్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు...,1