గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి పాల్గొని కార్మికుల హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ బెల్దే బిక్షపతి, ఐకెపి బాధ్యులు కే. రమేష్, కే. రేణుక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సఫాయి కార్మికులు చంద్రయ్య, మధు, లక్ష్మి తో పాటు భవన నిర్మాణ కార్మికులు రవి, ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి పాల్గొని కార్మికుల హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ బెల్దే బిక్షపతి, ఐకెపి బాధ్యులు కే. రమేష్, కే. రేణుక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సఫాయి కార్మికులు చంద్రయ్య, మధు, లక్ష్మి తో పాటు భవన నిర్మాణ కార్మికులు రవి, ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం మోడీకి అలవాటు: కేటీఆర్1
- కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.1
- కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*కార్మికుల కష్టాలను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందిజిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో *99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో* భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో *మేడే వేడుకలు - 2026* ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్,కార్మిక శాఖ సహాయ కమిషనర్శ్రీమతి సాహితి, జడ్పి సీఈఓ ఎల్లయ్య తో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు కలెక్టర్* మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు సరైన సబ్సిడీలు, బీమా సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మికసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల సంక్షేమం, కర్మాగారాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంఘాల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పోస్టర్స్ ను ఆవిష్కరించారు.కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సంబంధిత పరిశ్రమల శాఖయాజమాన్యంఐ.టీ.సఫ్యాక్టరీస్.సిబ్బంది కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు1
- కేవలం బిఆర్ఎస్ కు పేరు వస్తుందని ఉద్దేశంతో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని నిరుపయోగంగా మార్చాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మేడే వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నిర్మించిన ఐటీ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిరూప యోగంగా మార్చారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను రోడ్డున పడేసారని విమర్శించారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.1
- కామారెడ్డి జిల్లా : నేడు చైర్మన్ తో పాటు కౌన్సిలర్ లు శ్మశాన వాటిక ను సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల విషయంలో DPR తయారీకి ప్రతిపాదనల కోసం పట్టణంలోని రెండు స్మశానాల లో సందర్శనను బీజేపీ కౌన్సిలర్ లు వాకౌట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ లు 16 మంది మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధి కోసం గత రెండు రోజుల క్రితం స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయటానికి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు లేనిది నేడు కొత్తగా స్మశాన వాటికలకు కోటి 30 లక్షల రూపాయలకు DPR తయారు చేయటానికి ఈ రోజు ఛైర్మెన్ సమక్షంలో కౌన్సిలర్ లు సందర్శన పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అంటుంటే ప్రభుత్వం తరుపున ఖర్చు చేయటం ఎందుకు అని, ఆ డబ్బులు పట్టణంలో వార్డుల అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. స్మశాన అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు అని కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అనగా DPR తయారు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.1
- బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.1
- కార్మికుల హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. చికాగో నగర కార్మికుల వీరోచిత పోరాట ఫలితమే నేటి మే డే అని గుర్తుచేశారు. కార్మికులకు కచ్చితంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రమజీవుల సంక్షేమానికి అందరూ అండగా ఉండాలని కోరారు.1
- *140వ మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై* *సమాన పనికి సమాన* *వేతనంకై ఉద్యమీద్దాం* *మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి* ఈరోజు మెదక్ పట్టణ కేంద్రంలో మేడే సందర్భంగా 140వ మేడే సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. CITU కార్యలయం కేవల్ కిషన్ భవన్ దగ్గర, మున్సిపల్ కార్యాలయం, MCH హస్సిటల్ , రైల్వే స్టేషన్, భవన నిర్మాణ కార్మికుల అడ్డ, PACS గోదాం వద్ద సిఐటియు జండాలు ఆవిష్కరణ జరిగాయి. అనంతరం *పోస్టపీసు దగ్గర మేడే సభ నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం* ప్రసంగిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చిన గత 13 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 సంవత్సరాల క్రితం నుండి బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను కలిపి వేసి 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి తెస్తూ కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమై హక్కు కనీస వేతనం అడిగే హక్కు పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలకు నోచుకోకుండా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కార్మిక వర్గం ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దేశంలో సంఘటిత అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేక ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు. అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినానికై ఉవ్వెత్తున కార్మిక వర్గం పోరాటం చేసి రక్త తర్పణంలో రక్తంలో తడిసిన గుడ్డని ఎర్రజండగా మేడే జెండా ఎగరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సరళీకరణ నూతన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి జే.సంతోష్, వికలాంగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గ నాయకులు షౌకత్ మున్సిపల్ యూనియన్ కార్మికులు రాజా శేఖర్ ఏసు మల్లేశం శోభ ఎల్లవ్వ ఉషవ్వ పోచమ్మ శేఖర్ అంజి హమాలీ కార్మికులు బాల్ నర్సు మల్లేశం గట్టయ్య బాలు ఆంజనేయులు హనుమంత్ తదితరులు పాల్గొన్నారుజే సంతోష్. మెదక్ జిల్లా సహాయ కార్యదర్శి1
- కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను పురస్కరించుకొని నల్గొండ జిల్లా సిపిఎం కార్యాలయంలో ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వామపక్ష భావజాలాన్ని రూపుమాపేందుకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి సలీం, పాలడుగు నాగార్జున, దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.1