Shuru
Apke Nagar Ki App…
*శవాలు మధ్య రొమాన్స్ కావాలంటూ డాక్టర్ వేధింపులు..మహిళ ఆవేదన* ఆంద్రప్రదేశ్ నెల్లూరు పెద్దాసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినితో డాక్టర్ సురేష్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని..., శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్నారని బాధితులరాలు పేర్కొంది. కులం పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై విచారణ జరగాలని బాధితురాలు కోరుతున్నారు.
Ramesh Solanki
*శవాలు మధ్య రొమాన్స్ కావాలంటూ డాక్టర్ వేధింపులు..మహిళ ఆవేదన* ఆంద్రప్రదేశ్ నెల్లూరు పెద్దాసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినితో డాక్టర్ సురేష్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని..., శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్నారని బాధితులరాలు పేర్కొంది. కులం పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై విచారణ జరగాలని బాధితురాలు కోరుతున్నారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- *మరో బస్సు ప్రమాదం.....ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు!* తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న నిడదవోలు ఆర్టీసీ బస్సు రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.1
- Post by Gajapally Narsaiah1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.1
- Post by వేణు విలేకరి1
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ పండుగను పురస్కరించుకుని కామ దహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కోడల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనం జరిపారు. కామ దహన వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని, పూజలు నిర్వహించారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల మండలాల్లో కాముడు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. హోలీకి ఒక రోజు ముందే కోలాటాలు, నృత్యాలతో సంబరాలు జరిపి, సాయంత్రం చేనులో సంప్రదాయంగా కాముడు దహనం చేశారు. మరుసటి రోజు బూడిదను ఇంటి ముందు చల్లడం ఆనవాయితీ. సహజ రంగులతో రెండు రోజుల పాటు పండుగను ఆనందంగా జరుపుకున్నారు1
- *విశాఖపట్నం రుషికొండ దరి బీచ్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు దగ్ధం* రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం ఎంత? బస్సులో ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్‌నే అసలు కారణమా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ....1
- జగిత్యాల రైతుబజార్ లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారుతో బైక్ ను ఢీ కొట్టి అలజడిరేపారు. తాను కౌన్సిలర్ ను, ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేరు చెప్పి కౌన్సిలర్ లక్ష్మి భర్త రాజు హంగామా చేశాడు. మద్యం మత్తులో కారు నడిపి ఓ బైక్ ను ఢీ కొట్టాడు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లాడు. సిసి కెమెరాలో కౌన్సిలర్ భర్త వీరంగం రికార్డ్ అయింది. లైసెన్స్ ఉందా అంటు వ్యాపారులను, రైతులను నిలదీసి నిత్యావసర సరుకులు కింద పడేశాడు. తాను కౌన్సిలర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాక స్థానికులు తిరగబడ్డారు. దాడికి యత్నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్ భర్తను నిలదీస్తే కూరగాయల వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, అందుకే తనిఖీ చేస్తున్నానని వాదనకు దిగాడు. లైసెన్స్ ల గురించి మార్కెట్ కమిటీ చూసుకుంటుందని పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నిస్తే నేను కౌన్సిలర్ ను అంటు హడావిడి చేశాడు. చివరకు సిఐ కరుణాకర్ అక్కడికి చేరుకుని కౌన్సిలర్ భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను లైసెన్స్ చూపించాలని లేకుంటే అన్ని తొలగించి ఇక్కడ క్యాంటిన్ పెడుతానని బెదిరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దుకాణాలు ఖాళీ చేయాలని పలుమార్లు బెదిరించాడని వ్యాపారులు చెప్పారు. రాజుతో పాటు మరో వ్యక్తిపై నిత్యం బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.3