Shuru
Apke Nagar Ki App…
రాత్రిళ్లు రోడ్డుపై పశువులు వదిలితే చర్యలు............ రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గౌరీ శంకర్ హెచ్చరించారు. మండల పరిధిలో గేదెలు రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు రోడ్డుపై తిరిగే పశువులను గోశాలలకు తరలిస్తామని సీఐ తెలిపారు. నిర్లక్ష్యంగా పశువులను వదిలే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Nava surya
రాత్రిళ్లు రోడ్డుపై పశువులు వదిలితే చర్యలు............ రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గౌరీ శంకర్ హెచ్చరించారు. మండల పరిధిలో గేదెలు రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు రోడ్డుపై తిరిగే పశువులను గోశాలలకు తరలిస్తామని సీఐ తెలిపారు. నిర్లక్ష్యంగా పశువులను వదిలే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.4
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.4
- సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్* ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195 ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.1
- వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం1
- Post by Syyed taher1
- తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం లో నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్ట్ పనులును సోమవారం నాడు రాష్ట్ర మత్స్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి, అచ్చం నాయుడు, ఆర్ అండ్ బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి పనులు పరిశీలించారు ఈ ప్రాంతంతో అభివృద్ధిలో ముందుకు వెళుతుందని తెలిపారు.1
- సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు నేటితరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్ 119వ జయంతిని ఆదివారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు బాబూ జగ్జివన్ రామ్ విగ్రహ నిర్మాణం కమిటీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాబీర్ పాషా తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యదయానికి అహర్నిశలు కృషి చేశారని, మహాణీయుల్లో జగ్జీవన్ రామ్ ప్రముఖుడన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా నిస్వార్ధంగా సేవలందించారని, మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్ గా ప్రజల పక్షాన వారి గళాన్ని వినిపించి ప్రజలు, నిమ్నజాతి సంక్షేమకోసం అహర్నిషలు కృషి చేశారన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపనకోసం జగ్జీవన్ రామ్ పరితపించాడని అన్నారు. అయన అందించిన సేవలకు గుర్తింపుగా దేశ ప్రజలు బాబూజీగా నామకరణం చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కులరక్కసిని పారద్రోలేందుకు కృషి చేయాలని, రాజ్యంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.3
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల కింద చెక్కులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా మొత్తం 135 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1,35,15,666 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలపై పడే వివాహ ఖర్చు భారాన్ని తగ్గించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు తమ కుటుంబాలను సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.1