logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ... తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు... కాంగ్రెస్ కు నైతికత ఉంటే ఎమ్మెల్యే పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి... అంజన్న ఆశీర్వాద యాత్రలో కేంద్రమంత్రి బండి సంజయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజేపి నేత బండి సంజయ్ అంజన్న ఆశీర్వాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు 612 మంది సర్పంచ్ లు వార్డు సభ్యులు కౌన్సిలర్స్ కార్పోరేటర్ లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల వైఖరి పై మండిపడ్డారు. అంజన్న ఆశీర్వాద యాత్రను విమర్శించే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. మూర్ఖులు కొందరు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా హిందు సమాజాన్ని అగౌరవపర్చేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నైతికత ఉంటే, నిజమైన హిందువులు అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రజలకు కేవలం బిజేపి పై మాత్రమే నమ్మకం ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామరాజ్యం, మోడీ సర్కార్ ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హిందూసమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఏ కార్యక్రమం తీసుకున్న సక్సెస్ చేసేందుకు ముందుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ... తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు... కాంగ్రెస్ కు నైతికత ఉంటే ఎమ్మెల్యే పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి... అంజన్న ఆశీర్వాద యాత్రలో కేంద్రమంత్రి బండి సంజయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజేపి నేత బండి సంజయ్ అంజన్న ఆశీర్వాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు 612 మంది సర్పంచ్ లు వార్డు సభ్యులు కౌన్సిలర్స్ కార్పోరేటర్ లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల వైఖరి పై మండిపడ్డారు. అంజన్న ఆశీర్వాద యాత్రను విమర్శించే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక

పార్టీ అని మండిపడ్డారు. మూర్ఖులు కొందరు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా హిందు సమాజాన్ని అగౌరవపర్చేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నైతికత ఉంటే, నిజమైన హిందువులు అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రజలకు కేవలం బిజేపి పై మాత్రమే నమ్మకం ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామరాజ్యం, మోడీ సర్కార్ ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హిందూసమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఏ కార్యక్రమం తీసుకున్న సక్సెస్ చేసేందుకు ముందుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.
    4
    పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
    1
    పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు.
3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు.
పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు.
జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు
    1
    ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు
    user_ధర్మారం వార్తలు
    ధర్మారం వార్తలు
    Insurance Agent ధర్మారం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    1
    ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ  మన జిల్లాలో  03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై  ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    17 hrs ago
  • గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
    1
    గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 min ago
  • ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
    6
    ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  పాల్గొన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    18 hrs ago
  • జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు. మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు.
మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజేపి నేత బండి సంజయ్ అంజన్న ఆశీర్వాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు 612 మంది సర్పంచ్ లు వార్డు సభ్యులు కౌన్సిలర్స్ కార్పోరేటర్ లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల వైఖరి పై మండిపడ్డారు. అంజన్న ఆశీర్వాద యాత్రను విమర్శించే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. మూర్ఖులు కొందరు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా హిందు సమాజాన్ని అగౌరవపర్చేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నైతికత ఉంటే, నిజమైన హిందువులు అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రజలకు కేవలం బిజేపి పై మాత్రమే నమ్మకం ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామరాజ్యం, మోడీ సర్కార్ ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హిందూసమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఏ కార్యక్రమం తీసుకున్న సక్సెస్ చేసేందుకు ముందుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
    2
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజేపి నేత బండి సంజయ్ అంజన్న ఆశీర్వాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు 612 మంది సర్పంచ్ లు వార్డు సభ్యులు కౌన్సిలర్స్ కార్పోరేటర్ లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్  నింపిన బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల వైఖరి పై మండిపడ్డారు. అంజన్న ఆశీర్వాద యాత్రను విమర్శించే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. మూర్ఖులు కొందరు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా హిందు సమాజాన్ని అగౌరవపర్చేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నైతికత ఉంటే, నిజమైన హిందువులు అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రజలకు కేవలం బిజేపి పై మాత్రమే  నమ్మకం ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామరాజ్యం, మోడీ సర్కార్ ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హిందూసమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్  రావు ఏ కార్యక్రమం తీసుకున్న సక్సెస్ చేసేందుకు ముందుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.