logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు – గోదావరి పుష్కరాల దృష్ట్యా భారీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తాం : మంత్రి సీతక్క ములుగు జిల్లా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి జాతరను ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం విజయవంతంగా పూర్తి కావడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. భద్రాచలం–ఏటూరునాగారం రహదారి అభివృద్ధితో పాటు మంగపేట, వాజేడు, ఏటూరునాగారం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు – గోదావరి పుష్కరాల దృష్ట్యా భారీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తాం : మంత్రి సీతక్క ములుగు జిల్లా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి జాతరను ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం విజయవంతంగా పూర్తి కావడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. భద్రాచలం–ఏటూరునాగారం రహదారి అభివృద్ధితో పాటు మంగపేట, వాజేడు, ఏటూరునాగారం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కోతుల స్వైరవిహారం తీవ్ర స్థాయికి చేరింది. మున్సిపాలిటీ పరిధిలో కోతుల దాడులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నిన్న కోతుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కోతుల స్వైరవిహారం తీవ్ర స్థాయికి చేరింది. మున్సిపాలిటీ పరిధిలో కోతుల దాడులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
నిన్న కోతుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • తొర్రూరు: మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్ మరియు ప్రయాణికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని సాకుగా చూపి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి అధికారిని నడిరోడ్డుపై నిలదీసి చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
    1
    తొర్రూరు: మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్ మరియు ప్రయాణికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని సాకుగా చూపి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి అధికారిని నడిరోడ్డుపై నిలదీసి చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    13 hrs ago
  • హైదరాబాద్, బషీర్‌బాగ్: ఈరోజు బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు. ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు. వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    1
    హైదరాబాద్, బషీర్‌బాగ్:
ఈరోజు బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు.
ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు.
బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు.
వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
    1
    హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ 
ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి 
దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    18 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.​వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా గంగారం  మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.​వివరాల్లోకి వెళ్తే
కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సిరిసిల్లలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2K రన్‌ ను ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. 2కే రన్ లో విద్యార్థులు, క్రీడాకారులు పోలీసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
    3
    ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సిరిసిల్లలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2K రన్‌ ను ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. 2కే రన్ లో విద్యార్థులు, క్రీడాకారులు పోలీసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా  అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై  విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
    1
    బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది.
మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • ములుగు జిల్లా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి జాతరను ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం విజయవంతంగా పూర్తి కావడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. భద్రాచలం–ఏటూరునాగారం రహదారి అభివృద్ధితో పాటు మంగపేట, వాజేడు, ఏటూరునాగారం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
    1
    ములుగు జిల్లా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి జాతరను ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం విజయవంతంగా పూర్తి కావడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు.
దేవాలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.
భద్రాచలం–ఏటూరునాగారం రహదారి అభివృద్ధితో పాటు మంగపేట, వాజేడు, ఏటూరునాగారం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.