logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మల్లన్న నాయకత్వంలో బీసీ రాజ్యాధికారం సాధ్యం – వ్యవస్థ మార్పుకై కొత్త పోరాటానికి పిలుపు ✊ హైదరాబాద్, బషీర్‌బాగ్: ఈరోజు బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు. ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు. వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

8 hrs ago
user_Mediya wgl medical wgl
Mediya wgl medical wgl
Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
8 hrs ago

మల్లన్న నాయకత్వంలో బీసీ రాజ్యాధికారం సాధ్యం – వ్యవస్థ మార్పుకై కొత్త పోరాటానికి పిలుపు ✊ హైదరాబాద్, బషీర్‌బాగ్: ఈరోజు బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు. ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు. వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • తొర్రూరు: మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్ మరియు ప్రయాణికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని సాకుగా చూపి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి అధికారిని నడిరోడ్డుపై నిలదీసి చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
    1
    తొర్రూరు: మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్ మరియు ప్రయాణికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని సాకుగా చూపి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి అధికారిని నడిరోడ్డుపై నిలదీసి చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    7 hrs ago
  • హైదరాబాద్, బషీర్‌బాగ్: ఈరోజు బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు. ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు. వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    1
    హైదరాబాద్, బషీర్‌బాగ్:
ఈరోజు బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ దళ కమాండర్ పటేల్ వనజ మాట్లాడుతూ బీసీ వర్గాల రాజకీయ సాధికారత కోసం మల్లన్న నాయకత్వంలో కొత్త దిశలో పోరాటం ప్రారంభమైందని తెలిపారు.
ఏండ్ల తరబడి పీడిత వర్గాల కోసం అడవుల్లో పోరాటం చేశామని, ఇప్పుడు అదే పోరాటాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు.
బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని తీసుకురావడం మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సాధారణ రాజకీయ చేరిక కాదని, వ్యవస్థ మార్పు కోసం ప్రారంభమైన కొత్త ఉద్యమమని స్పష్టం చేశారు.
వ్యాపార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల రాజ్య స్థాపనకై అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది.
ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
    1
    హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ 
ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి 
దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ మాస వసంత ఋతువు శుక్ల పక్ష పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి ఆలయ సన్నిధిలో ముత్యాల పందిరిలో స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ మహేష్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి అన్నదానం చేశారు. మహిళా భక్తులు స్వామివారికి ఓడి బియ్యం పోశారు. కళ్యాణోత్సవంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఆంజనేయులు, సతీష్, సంపత్ పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ మాస వసంత ఋతువు శుక్ల పక్ష పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి ఆలయ సన్నిధిలో ముత్యాల పందిరిలో స్వామి వారి  కళ్యాణం నిర్వహించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ మహేష్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి అన్నదానం చేశారు. మహిళా భక్తులు స్వామివారికి ఓడి బియ్యం పోశారు. కళ్యాణోత్సవంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఆంజనేయులు, సతీష్, సంపత్ పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.​వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా గంగారం  మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.​వివరాల్లోకి వెళ్తే
కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
    1
    బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది.
మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • ​కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    2
    ​కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
​మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.