Shuru
Apke Nagar Ki App…
మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Priya
మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- వెల్దుర్తికే టీజీ పబ్లిక్ స్కూల్.. తరలింపు ఉండదు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైన టీజీ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. స్కూల్‌ను మరో గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఆందోళనకు దిగిన స్థానిక యువకులతో ఆమె మాట్లాడారు. ఈ అంశంపై జిల్లా కలెక్టరుతో చర్చించి వెల్దుర్తికే స్కూల్ కేటాయింపు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో యువకులు ఆందోళన విరమించారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మెదక్ పట్టణ ప్రధాన రహదారి పై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరుతో బురదమైన జెఎన్ రోడ్డు మెదక్ ప్రధాన రహదారి బురదమయం మెదక్ పట్టణంలో స్థానిక కూరగాయల మార్కెట్ నుండి రాందాస్ చౌరస్తా వరకు డ్రైనేజీ నీళ్లతో బుర్రమయంగా మారింది వాహనాలు ఆ నీటి పైనుండి వెళ్ళినప్పుడు బురద నీరు చిరు వ్యాపారులపై పాదాచార్లపై చిమ్ముతున్నాయి దాంతో దుర్వాసన వెదజల్లుతుంది మున్సిపల్ చైర్మన్ ఇంటికి సమీపంలో బురద నీరు నిలబడిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చు పట్టణంలోని డ్రైనేజీలన్ని మట్టి లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది మున్సిపల్ కమిషనర్ స్థానిక కూరగాయల మార్కెట్ వెళ్లి క్షేత్రస్థాయి పర్యటన చేస్తే వాస్తవం వెళ్లడవుతుంది లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ పట్టణ రోడ్లన్నీ బురదమయంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే డ్రైనేజీలన్నీ శుభ్రం చేయించాల్సిన అవసరం. వుంది. నూతనంగా నిర్మించిన బీడీ రోడ్ సీసీ రోడ్లను ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాల్సిన కాంట్రాక్టర్ చిన్నచిన్న పనులు పూర్తి చేయకపోవడంతో మిషన్ భగీరథ కనెక్షన్ గుంతలన్నీ గుంతలు గానే ఉన్నాయి వాహనాలు వెళ్లినప్పుడు ద్విచక్ర వాహనంపై కూర్చున్నవారు ఎక్కడ పడతారు అన్న ఆందోళన నెలకొంది జె ఎన్ రోడ్ పై గుంతలను గూర్చి మురుగునీరు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది.1
- 47 టీఎంసీల సమ్మక సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం రేవంత్ వదులుతుండు: హరీష్ రావు 47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా? కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు వస్తున్నాయి GRMB అజెండాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేదే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటుంది ఈ 47 టీఎంసీలకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్నీ అనుమతులు తెచ్చాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వదులుతుంది? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి దీని మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.1
- మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా సర్కిల్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి నాట్యమాడి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజులు కాలికి గజ్జెకట్టి వీరగోలలతో మహంకాళి అమ్మవారి భక్తిగీతాలకు నృత్యం చేసి చిందులేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య తదితర అన్ని విభాగాల ఉద్యోగులు అమ్మవారి పాటలకు భాజాభజంత్రీల మధ్య డప్పు చప్పుళ్లకు తగ్గట్లు డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారికి బోనాలు సర్పించిన అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ చేపట్టారు.1
- మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.1
- కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.4