కవ్వాల్ ZPHS లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక... మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిదవ తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు.ప్రధానోపాధ్యాయులు కట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ... పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులను దీవించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు కట్ట శ్రీనివాస్,గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నల్ల తీగల విష్ణు,ఉపాధ్యాయులు జగన్మోహన్,రాజలింగు, ప్రవీణ్ కుమార్, రాజు, కవిత,కుమారి,సుమిత్ర,వార్డు సభ్యులు సాయి, దేవి సింగ్,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
కవ్వాల్ ZPHS లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక... మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిదవ తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు.ప్రధానోపాధ్యాయులు కట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ... పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులను దీవించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు కట్ట శ్రీనివాస్,గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నల్ల తీగల విష్ణు,ఉపాధ్యాయులు జగన్మోహన్,రాజలింగు, ప్రవీణ్ కుమార్, రాజు, కవిత,కుమారి,సుమిత్ర,వార్డు సభ్యులు సాయి, దేవి సింగ్,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
- *డిజిటల్ బాటలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల:* కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ బుధవారం ఆరవ రోజు కళాశాలలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, పాలనలో పారదర్శకతను పెంచేందుకు రికార్డుల నవీకరణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల,శ్రమదానం పై ప్రత్యేక దృష్టి సారించారు. పాత రికార్డులను స్కాన్ చేసి భద్రపరిచే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు మరియు సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లనుఅప్‌డేట్ చేశారు. కళాశాలలోని ఫర్నిచర్ కి అవసరమైన చిన్న తరహా మరమ్మతులు చేపట్టి, తరగతి గదులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కళాశాల పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు, రికార్డుల నిర్వహణను,తరగతి గదులను డిజిటలైజ్ చేయడం ద్వారా సమాచారాన్ని వేగంగా,బోధన ఆకర్షణీయంగా పొందే వీలుంటుందని రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులను సరికొత్త హంగులతో, ఆధునిక వసతులతో ఆహ్వానించడానికి కళాశాల అధ్యాపకులు,సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, వివిధ విభాగాల డీన్లు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు, అనుబంధ ఆచార్యులు, అధ్యాపక మరియు కార్యాలయ సిబ్బంది,ఎన్సిసి, ఎన్ఎస్ఎస్,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.1
- సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.1
- कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।1
- మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.2
- నెరడిగొండ : మండల అంగన్ వాడి అసోసియేషన్ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్ వాడిల తరపున అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అంగన్ వాడిలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 1. ప్రి ప్రైమరిని అంగన్ వాడిల ద్వారానే నడిపించాలని. 2. కనీస వేతనం రూ. 26,000/- చెల్లించాలని, 3. రిటైర్మెంట్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష చెల్లించాలని డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు.1
- పత్రిక ప్రకటన తేది:11.03.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని సదాశివ నగర్ మండలం లోని వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.1
- రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.1