నల్గొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామం లో యదేచ్చగా పట్టపగలే ఇసుక దందా.! నల్లగొండ బ్రేకింగ్: అధికారులను అడ్డం పెట్టుకొని నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో భారీగా ఇసుక దందా జరుగుతున్నట్లు ఆరోపణలు... రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగుతున్నట్లు గ్రామస్థుల ఆరోపణలు... చెరువు నుంచి అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న స్థానికులు... ఇసుక మాఫియా వల్ల గ్రామ పరిసరాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజల ఆవేదన... అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థుల అసంతృప్తి... అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక... కొందరు మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపణలు.. అక్రమ ఇసుక దందాపై వెంటనే దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్... అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్న గ్రామస్థులు...
నల్గొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామం లో యదేచ్చగా పట్టపగలే ఇసుక దందా.! నల్లగొండ బ్రేకింగ్: అధికారులను అడ్డం పెట్టుకొని నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో భారీగా ఇసుక దందా జరుగుతున్నట్లు ఆరోపణలు... రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగుతున్నట్లు గ్రామస్థుల ఆరోపణలు... చెరువు నుంచి అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న స్థానికులు... ఇసుక మాఫియా వల్ల గ్రామ పరిసరాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజల ఆవేదన... అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థుల అసంతృప్తి... అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక... కొందరు మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపణలు.. అక్రమ ఇసుక దందాపై వెంటనే దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్... అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్న గ్రామస్థులు...
- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి.. నల్గొండ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ! యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపు... మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది... మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు... ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచన... సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచన... నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యం... నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్,న్యాక్ సెంటర్ ఏర్పాటు... సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తాం... *రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.*☝️1
- వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.1
- నాగారం డివిజన్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 14 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.రాజు* బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది4
- హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతంలో ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసదుద్దీన్ ఓవైసీ తో పాటు భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, స్థానిక ప్రజలు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేశారు. సుమారు 8,000 నుంచి 10,000 మంది వరకు ఈ విందులో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.1
- మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.1
- కేశంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పదవ తరగతి తెలుగు పరీక్షకు విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు. మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మూడు సెంటర్లలో మొత్తం 512 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అందరూ హాజరై 100 శాతం హాజరు నమోదు అయినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగినట్లు ఆయన పేర్కొన్నారు.4
- నల్లగొండ బ్రేకింగ్: ఏకంగా రోడ్డుపై సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమా? రవీంద్రనగర్‌లో 24 ఫీట్ల రోడ్డు పై ఆక్రమ నిర్మాణం కలకలం.. స్పందించని అధికారులు.స్థానికుల ఆందోళన.. రోడ్డే కబ్జా చేస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యం… నిద్రలో మున్సిపల్ అధికారులు.. పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని నగర టౌన్ ప్లానింగ్ అధికారులు... *పేదలకు ఒక న్యాయం, బలిసిన వారికి మరో న్యాయం?* రవీంద్రనగర్‌లో అధికారులపై పలు ఆరోపణలు.. రోడ్డుపై గుంతలు చేసి సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. అధికారులపై ప్రజల ఆగ్రహం విజయ గణపతి ఆలయం సమీపంలో పట్టపగలే రోడ్డు ఆక్రమణ.. అక్రమ నిర్మాణం అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్.. సెకండ్ సాటర్ డే, సండే హాలిడే ఉంది తర్వాత చూద్దామని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు... ఇదే కన్స్ట్రక్షన్ నిరుపేద వారు ఎవరైనా కడితే అధికారులు ఊరుకుంటారా! కన్స్ట్రక్షన్ ఆగేనా మూడుపుల మత్తులో అధికారులు చేతులు దులుపుకునేనా వేచి చూడాల్సిందే.!1