Shuru
Apke Nagar Ki App…
Ravi Poreddy
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్లలో గత 20–30 ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు ఇప్పటివరకు ఇంటి పట్టాలు, హౌస్ నెంబర్లు ఇవ్వలేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ కాలనీల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటనే గృహజ్యోతి పథకంలో చేర్చాలని, అలాగే నూతన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకూ గృహజ్యోతి వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల హక్కుల కోసం నిర్భయంగా స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యే చొరవను పలువురు అభినందించారు1
- నిజాంపేటలో దట్టమైన పొగ మంచు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం దట్టమైన పొగ మంచు కురవడంతో రామాయంపేట సిద్దిపేటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పొగ మంచు కారణంగా వాహనదారులు లైట్లు డిప్పర్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. కొత్త కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో మంచు ప్రభావం మేఘాలు మబ్బులు కమ్ముకోవడం జరుగుతుంది. ఈ పొగ మంచుకు ప్రజలు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.1
- 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 2 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ నియోజకవర్గంలో ఘనంగా నర్సారెడ్డి జన్మదిన వేడుకలు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తూంకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. పార్టీ అభిమానులు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబురాలు జరిపారు. ఉదయం కొండపోచమ్మ ఆలయం నుంచి నర్సారెడ్డితో పాటు అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో ర్యాలీగా బయలుదేరి గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి నర్సారెడ్డికి గజమాలతో సత్కరించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో శాలువాలు, పూలదండలతో సన్మానించారు. గజ్వేల్ పట్టణంలో ప్రధాన రహదారి కొనసాగిన ర్యాలీలో క్వింటాళ్ళ కొద్దీ పూలుచల్లి కార్యకర్తలు, అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనేక చోట్ల క్రేన్లతో గజమాలలతో నర్సారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్, సర్దార్ ఖాన్, రంగారెడ్డి, సారిక శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, మహమ్మద్ సమీర్, డాక్టర్ వహీద్, గౌడిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ అజ్గర్, గణేష్, జంగం రమేష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు.. కళియామర్ధన అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన దేవదేవుడు..1
- అందరూ ఆహ్వానితులే .... ఆదివారం బోర్లం గ్రామానికి శ్రీ సమర్థ సద్గురు దుబ్బాక మహారాజ్ రాక.... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఆదివారం రామనామస్మరణ గురు వందనం కార్యక్రమానికి పురస్కరించుకుని శ్రీ సమర్థ సద్గురు మహారాజ్ దుబ్బాక వారు బాన్సువాడ లోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రాంగణ మంతా పంచామృతలతో అభిషేకం గావించి ముహూర్తాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే సుమారు 5000 పైబడి భక్తులు రావచ్చని బోర్లం గ్రామస్తులు అంచనా వేస్తున్నారు దానికిగాను కావలసిన వస్తువులను ఏర్పాట్లు పూర్తయ్యాయని గ్రామస్తులు తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు తప్పకుండా గురువందనం రామనామస్మరణకి ప్రోగ్రాం కి హాజరై విజయవంతం చేయాల్సిందిగా బోర్లం గ్రామస్తులు కోరుతున్నారు1
- పుట్టకూటి కోసం ఓ యాచకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వీడియో ఒక చిక్కిన ఘటన అందరిని ఆశ్చర్య చికితులను చేస్తుంది. తాను యాచించే ప్రదేశానికి వచ్చి షర్టు విప్పి లేని వైకల్యం ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ యాచన చేస్తుండడంతో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతోటి డ్రామా మొత్తం బయటపండింది.1
- తగ్గేదేలేదంటున్న గోపాలరావు పేట వృద్ధా గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్ స్టోరీ చూడండి1
- వరంగల్:వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఉన్న బీరన్న గొర్రెల సహకార సంఘం నూతన చైర్మన్ ఎన్నిక కురుమ కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అభివృద్ధి, గొర్రెల పెంపకదారుల సంక్షేమమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో సభ్యుల ఏకాభిప్రాయంతో చిక్కోండ రవిను ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయనపై సంఘ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తూ, సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సంఘ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే సభ్యులుగా కామిండ్ల లింగాలు కం చాల కొంరట్లో, చెవుల్ల దేవేందర్, మల్లల్లాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు అభినందిస్తూ, భవిష్యత్తులో సంఘం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.1
- *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో1