ప్రాక్టికల్ లేదు... ప్రాక్టీసు లేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ విద్యార్థులు కాలేజీలో ప్రాక్టికల్ లేదు..ప్రాక్టీసు లేదు అంటూ ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు బోధించేందుకు ఉపాధ్యాయులు రారు. ప్రాక్టీస్ చేసేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ... కళాశాల ముందు ప్లకార్ట్స్ పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓయూ ఉన్నతాధికారులు స్పందించి ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు క్లాసులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో విసీ చాంబర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రాక్టికల్ లేదు... ప్రాక్టీసు లేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ విద్యార్థులు కాలేజీలో ప్రాక్టికల్ లేదు..ప్రాక్టీసు లేదు అంటూ ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు బోధించేందుకు ఉపాధ్యాయులు రారు. ప్రాక్టీస్ చేసేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ... కళాశాల ముందు ప్లకార్ట్స్ పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓయూ ఉన్నతాధికారులు స్పందించి ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు క్లాసులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో విసీ చాంబర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.
- విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1
- డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ అత్యంత ప్రాధాన్యం పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలలోకి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన వార్త లాప్ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.1
- శివంపేట్ మండలంలోని Bharat Petroleum కు చెందిన Bharatgas ఏజెన్సీ వద్ద ముందుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ ప్రజలు సిలిండర్లతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఉదయం నుంచే చిన్న పిల్లలు, మహిళలు లైన్లో నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తుండటం స్థానికులను కలచివేస్తోంది. సరఫరా లోపం, నిర్వాహక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకము పట్టు వస్త్రాలంకరణ అమ్మవారి అలంకరణ గావించారు అనంతరం పుష్పాలకరణ రావించి సహస్ర మార్చిన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు ఆలయ పూజారి భక్తులను ఆశీర్వదించి తీర్థ వితరణ గావించారు.1
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రంజాన్ పవిత్రత మనసులను కలిపే శక్తి అని కలెక్టర్ తెలిపారు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికీ చేరే విధంగా ఏర్పాట్లు చేశామని... జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ:* ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వారికి పోలీస్ శాఖ తరపున దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం... పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటుందని హామీ... యువత తప్పుదారులు పడకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపు... జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు... అనంతరం అతిధులను ముస్లిం మత గురువులు శాలువాలతో సన్మానించారు... ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి కే శివరాం రెడ్డి, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐలు, ఎస్సైలు, నల్గొండ డిప్యూటీ మేయర్ ఆమెర్ ,నల్లగొండ కార్పొరేటర్లు, పట్టణ పుర ప్రముఖులు ముస్లిం మత గురువులు తదితరులు పాల్గొన్నారు.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మ! హైదరాబాద్ : టీమ్ ఇండియా యువ ఆల్‌రౌండర్, టీ20 వరల్డ్ కప్-2026 విజేత తిలక్ వర్మ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి నగరానికి చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ గడ్డ గర్వపడేలా చేసినందుకు తిలక్ వర్మను సీఎం ప్రశంసించారు.కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1
- NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తన మాతృమూర్తి *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు... కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న రుగ్మతతో వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి... ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...2