Shuru
Apke Nagar Ki App…
ఐనవోలు మండలంలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..మొత్తం 708 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 708 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ పులి ఆనందం తెలిపారు. వీరిలో 481 మంది బాలురు, 227 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం ఐనవోలు ఏపీహెచ్‌ఎస్, పున్నేలు ఏపీహెచ్‌ఎస్, పందిని జెడ్‌పీహెచ్‌ఎస్, ఫాత్ ఫైండరీ హైస్కూల్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఎంఈఓ తెలిపారు.
M D Azizuddin
ఐనవోలు మండలంలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..మొత్తం 708 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 708 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ పులి ఆనందం తెలిపారు. వీరిలో 481 మంది బాలురు, 227 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం ఐనవోలు ఏపీహెచ్‌ఎస్, పున్నేలు ఏపీహెచ్‌ఎస్, పందిని జెడ్‌పీహెచ్‌ఎస్, ఫాత్ ఫైండరీ హైస్కూల్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఎంఈఓ తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల్లో వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుష్ కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎంపీ కోరారు.అలాగే ఆయుష్ వైద్య కేంద్రాల్లో సరఫరా అయ్యే మందులపై సంవత్సరం వారీగా చేసిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, పరీక్షల ఫలితాలు, నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై తీసుకున్న చర్యలు లైసెన్స్ సస్పెన్షన్, రద్దు, బ్లాక్‌లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలపై వివరాలు కోరారు. అదేవిధంగా, ఆయుష్ మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా, బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతలో లోపాలు తేలితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే మందులను వెనక్కి తీసుకుని కొత్తవి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఈ-ఔషధి (e-Aushadhi) డిజిటల్ వ్యవస్థను అమలు చేసి ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో అక్రమాలు, కొరతలను నివారించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతంపై ఎంపీ డా. కడియం కావ్య నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.5
- మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో *జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్,* అదనపు కలెక్టర్ రెవెన్యూ అనిల్ కుమార్, సివిల్ సప్లై, గ్యాస్ డీలర్స్, విద్యాశాఖ, హాస్పటల్ సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరా పై *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్,* సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం (11) ఏజెన్సీల పరిధిలో 2,12131 గ్యాస్ కనెక్షన్లు కలవని, గతవారం రోజుల నుండి పైన తెలిపిన 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 13985 సిలిండర్ల వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగిందని, డిమాండ్ కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వలో సిద్ధంగా ఉన్నాయన్నారు, అనవసరంగా ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, డిమాండ్ కనుగుణంగా గ్యాస్ లభ్యత ఉందని, తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద ఉన్న స్టాకును గమనిస్తూ ఉండాలని వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకము కలిగించినట్లయితే, అలాంటి వినియోగదరులపైన కూడా చట్టపరముగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీల వద్ద, ఆన్లైన్లో కానీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో, గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్* మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఏట్టి పరిస్థితిలలో అలాంటి వార్తలను నమ్మ వద్దని తెలిపారు, ప్రభుత్వం సూచించిన ప్రకారం 25 రోజుల అనంతరం మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని, గ్యాస్ సరఫరా చేసే వాహనాలను సిబ్బందిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీ తెలిపారు,1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజేపి నేత బండి సంజయ్ అంజన్న ఆశీర్వాదయాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని బిజెపికి చెందిన ప్రజాప్రతినిధులు 612 మంది సర్పంచ్ లు వార్డు సభ్యులు కౌన్సిలర్స్ కార్పోరేటర్ లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల వైఖరి పై మండిపడ్డారు. అంజన్న ఆశీర్వాద యాత్రను విమర్శించే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. మూర్ఖులు కొందరు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా హిందు సమాజాన్ని అగౌరవపర్చేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నైతికత ఉంటే, నిజమైన హిందువులు అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రజలకు కేవలం బిజేపి పై మాత్రమే నమ్మకం ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రామరాజ్యం, మోడీ సర్కార్ ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హిందూసమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఏ కార్యక్రమం తీసుకున్న సక్సెస్ చేసేందుకు ముందుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.2
- పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.1
- ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.1
- గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు1
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 708 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ పులి ఆనందం తెలిపారు. వీరిలో 481 మంది బాలురు, 227 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం ఐనవోలు ఏపీహెచ్‌ఎస్, పున్నేలు ఏపీహెచ్‌ఎస్, పందిని జెడ్‌పీహెచ్‌ఎస్, ఫాత్ ఫైండరీ హైస్కూల్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఎంఈఓ తెలిపారు.1
- చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: : హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష.... చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశమందిరం లో ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ పాల్గొని సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధి లోని నీటి వనరు లైన చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ముందుగా అంచనా, ప్రణాళిక – నీటి నాణ్యత, కాలుష్య మూలాలు, సిల్ట్ పేరుకుపోవడం, జీవ వైవిధ్యాన్ని పరిశీలించి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ,మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి రాకుండా ఇంటర్‌సెప్షన్,డైవర్షన్ డ్రెయిన్లు, సీవేజ్ నెట్‌వర్క్, ఎస్ టి పి ల ఏర్పాటు ద్వారా నియంత్రించవచ్చని ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో కుడా సి పి ఓ అజిత్ రెడ్డి అదనపు కలెక్టర్ రవి బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఆర్ డి ఓ రాథోడ్ రమేష్ ఇరిగేషన్, కుడా , బల్దియా ఈ ఈ లు కిరణ్ కుమార్ భీమ్ రావు మహేందర్ సంతోష్ బాబు ఇరిగేషన్ డి ఈ హర్షవర్థన్ ఎన్ ఐ టి మాజీ ప్రొఫెసర్ పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.4
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపడుతున్నారు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. వారితోపాటు వేలాది మంది బిజేపి కార్యకర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ఊ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో నింపేశారు. 40 కిలోమీటర్లు సాగే పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకఢ్బందీ చర్యలు చేపట్టారు.1