అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద పౌర్ణమి అన్నదానం దత్తాత్రేయ స్వామికి జలాభిషేకం, ప్రత్యేక పూజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త దుబకుంట లక్ష్మణ్ సౌజన్యంతో పెరుగన్నం,పులిహోర పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ అందరికీ అయ్యప్ప స్వామి,దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని మరో గాగిలాపూర్ దత్తాత్రేయ క్షేత్రంగా గజ్వేల్ దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతుందని,అన్నారు ప్రతి పౌర్ణమి రోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పౌర్ణమి రోజున పెరుగన్నం దానం చేస్తే మహా పుణ్యం లభిస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, సీనియర్ నాయకులు బొగ్గుల చందు,దుబాకుంట లక్ష్మణ్, కైలాస ప్రశాంత్,ఉప్పల చంద్ర శేఖర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు
అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద పౌర్ణమి అన్నదానం దత్తాత్రేయ స్వామికి జలాభిషేకం, ప్రత్యేక పూజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త దుబకుంట లక్ష్మణ్
సౌజన్యంతో పెరుగన్నం,పులిహోర పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ అందరికీ అయ్యప్ప స్వామి,దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన దత్తాత్రేయ
స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని మరో గాగిలాపూర్ దత్తాత్రేయ క్షేత్రంగా గజ్వేల్ దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతుందని,అన్నారు ప్రతి పౌర్ణమి రోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పౌర్ణమి రోజున పెరుగన్నం దానం చేస్తే మహా
పుణ్యం లభిస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, సీనియర్ నాయకులు బొగ్గుల చందు,దుబాకుంట లక్ష్మణ్, కైలాస ప్రశాంత్,ఉప్పల చంద్ర శేఖర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు
- ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.1
- స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్య అంశాలు: కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.1
- _ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ పోలీసుల సడెన్ రైడ్‌తో 5 మంది గ్యాంగ్ సభ్యులు అరెస్ట్.. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షలు విలువ చేసే 5 కిలోల గంజాయి సీజ్ ,రెండు పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం... ఉడిపి హోటల్ దగ్గర గుట్టుగా డీల్ చేస్తూ చిక్కిన యువకులు... *పారిపోదాం అనుకున్నారు..* ప్లాన్ ఫెయిల్ – వెంటనే పట్టేసిన టూ టౌన్ పోలీసులు... ఒక్క కేజీ 3 వేలకే కొనుగోలు చేసి నల్గొండలో భారీ రేటుకు అమ్మకం... ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా మొదలై గంజాయి బిజినెస్‌గా మారిన కథ... ఇంకా 6 మంది పరారీలో – పోలీసుల వేట కొనసాగుతోంది... గంజాయి అంటే జైలు టికెట్ ఖాయం.. అంటూ *అడిషనల్ ఎస్పీ జి రమేష్* స్ట్రాంగ్ వార్నింగ్... నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో టూ టౌన్ సీఐ S.రాఘవ రావు,ఆద్వర్యంలో ఎస్సై వై.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.రాజు,మరియు కానిస్టేబుల్ L.బాలకోటి,MD.షకీల్ లతో లను జిల్లా S.P అభినందించనైనది...1
- *సరి'కొత్త' కోర్సుల సందడి* : ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్. బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.3
- కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- భిక్నూర్ 02-05-2026 కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షులు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,గ్రామ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు రాజబాబు గౌడ్, విజయ్ గౌడ్, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న 25 మంది దంపతులు.. బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మెల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 25 మంది కుటుంబాలు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గము పొందుటకు అతి తక్కువ ఖర్చులో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చునని భక్తులకు తెలిపారు.కోరిన భక్తులకు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. శ్రీబాలాజీ అన్నదాన సత్రంవారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేసినట్లు డాక్టర్ పి.గోపాల్,శేఖర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్య,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.1