Shuru
Apke Nagar Ki App…
హైదరాబాదులోని మల్కాజిగిరి ఎస్‌వోటీ దాడుల్లో కల్తీ పనీర్ పట్టివేత MDCL: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు చెర్లపల్లి నుంచి నాగారం తరలిస్తున్న రెండు ఆటోరిక్షాలను తనిఖీ చేసి 300 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు యాదాద్రి జిల్లాకు చెందిన సతీష్, అనిల్‌కు చెందినదిగా గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Ram Thotapally
హైదరాబాదులోని మల్కాజిగిరి ఎస్‌వోటీ దాడుల్లో కల్తీ పనీర్ పట్టివేత MDCL: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు చెర్లపల్లి నుంచి నాగారం తరలిస్తున్న రెండు ఆటోరిక్షాలను తనిఖీ చేసి 300 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు యాదాద్రి జిల్లాకు చెందిన సతీష్, అనిల్‌కు చెందినదిగా గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
More news from Nalgonda and nearby areas
- హైదరాబాదులోని మల్కాజిగిరి ఎస్‌వోటీ దాడుల్లో కల్తీ పనీర్ పట్టివేత MDCL: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు చెర్లపల్లి నుంచి నాగారం తరలిస్తున్న రెండు ఆటోరిక్షాలను తనిఖీ చేసి 300 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు యాదాద్రి జిల్లాకు చెందిన సతీష్, అనిల్‌కు చెందినదిగా గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.1
- శ్రీశైల దేవస్థానం తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. *ధర్మకర్తల మండలి సమావేశం* • 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు • వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమశాస్త్రానుసారంగా వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం • దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట ఆలయంలో అభివృద్ధి పనులు, • ఆగష్టు 7న కొలనుభారతి క్షేత్రంలో శాకంభరీ ఉత్సవం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి 9వ సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈనాటి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రేపు ( 29.07.2026) జరిగే శాకంభరీ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండేందుకు రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు తలపెట్టిన వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం జరుగుతుందన్నారు. వరుణయాగం, శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు. టి.టి.డి తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపడం తప్పనిసరి. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత. • సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్ట వేళలలో మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ దర్శనాలు జారీకి కూడా ఆన్‌లైన్ విధానం అమలు. • లోకకల్యాణం కోసం అయిదు రోజులపాటు అనగా తేది : 07.08.2026 నుండి 11.08.2026 వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం. • శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. • శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించడమైనది. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అంచనాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది. • ఆలయముందుభాగంలో సాలుమండపాల నిర్మాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. అయితే క్యూకాంప్లెక్సు నిర్మాణం, క్షేత్రపరిధిలో శౌచాలయాల నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టడం జరుగుతుంది. • సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాలలో శౌచాలయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ నందు 11 గదులు ఉండేవిధంగా వీటి నిర్మాణం చేపట్టబడుతుంది. ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి సుమారు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టైప్ –ఎ మోడల్ నందు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్లాక్‌లో అదనంగా స్నానపుగదులు కూడా ఏర్పాటు చేయబడుతాయి. • భక్తుల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు, మరియు యోగివేమారెడ్డి సత్రం వెనుకభాగంలో రూ. 24లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించాలని తీర్మానించడం జరిగింది. • శ్రావణమాసోత్సవాలలో ప్రధాన గోపురాలకు విద్యుద్దీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. • భక్తుల సౌకర్యార్థం నందీశ్వర డార్మెటరీలో డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 39 లక్షలు. • అదేవిధంగా నీలకంఠేశ్వర డార్మెటరీ నందు కూడా డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 23 లక్షలు. • భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నందు అదనపు వాటరు కూలర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వీటి అంచనా వ్యయం రూ. 5లక్షలు • ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు విధానంలో పిలువబడిన టెండర్లను అనుసరించి రాబోవు 2027 సంవత్సరపు వివిధ రకాల క్యాలెండర్లను మరియు రెండు రకాల డైరీలను ముద్రించాలని నిర్ణయం. • స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు • అన్నప్రసాద వితరణ భవనములో కూడా రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు.1
- నల్లమల గిరిజనులు, ఆదివాసీలు ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం, అచ్చంపేట నియోజకవర్గంలో రూ.12.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ* నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మన్నానూర్ గ్రామం లోని చెంచు గిరిజనుల స్వయం ఉపాధికి రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, గురుకులాల ఆకస్మిక తనిఖీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి విద్యార్థులు, సిబ్బందితో ముఖాముఖి విద్య, వసతి, మౌలిక వసతులపై సమగ్ర సమీక్ష దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ కలలు కన్న సమసమాజ నిర్మాణం,దళిత,గిరిజన సాధికారత,నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నల్లమల గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రత్యేక లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారి పిల్లలకు అత్యున్నత స్థాయి విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మంత్రి అన్నారు.మంగళవారం మన్ననూరులో పర్యటించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది,ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివిధ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.మంత్రి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం,పీవీటీజీ గురుకుల విద్యాసంస్థ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఇతర విద్యాసంస్థల తరగతి గదులు,హాస్టళ్లు,వంటశాలలు,భోజనశాలలు,తాగునీటి సౌకర్యాలు,మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, ఆహార నాణ్యత,ఆరోగ్య సేవలు,పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, క్రీడా సామగ్రి, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పాలని సూచిస్తూ,ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశం ఇచ్చిన మంత్రి, నల్లమల అడవులు తెలంగాణకు ప్రకృతి వరమని,వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అమ్రాబాద్,పదర మండలాల్లో ఆర్టికల్–273(1) గ్రాంట్, ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకాల కింద రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యా సంస్థల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, టాయిలెట్ బ్లాకులు,తాగునీటి సదుపాయాలు,స్టోరేజ్ సంపులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు.అదే విధంగా చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అడవుల్లో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, ఇతర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన కుటుంబాలకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ....,మహేంద్రనాథ్ గారు తన జీవితమంతా దళితులు, గిరిజనులు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రజా ప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ చేరేలా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం. నల్లమల బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోము.అవసరమైన ప్రతి రూపాయిని ప్రభుత్వం వెచ్చిస్తుంది అని స్పష్టం చేశారు.నల్లమల ప్రాంతంలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శప్రాయంగా గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మొటిక్ చార్జీలను కూడా గణనీయంగా పెంచి విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, అవసరమైన వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతపై స్పందించిన మంత్రి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన చోట వెంటనే బోధన సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి త్వరితగతిన భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. బోధన సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే జూన్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పదేళ్లకు పైగా సేవలందిస్తున్న నాన్-టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ అయిన వారి కేసులను శాఖాపరంగా సమీక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి సమానంగా ముఖ్యమని అన్నారు.మహిళా గిరిజన గురుకుల పాఠశాల తనిఖీలో తాగునీరు,మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.దళిత, గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు .హైదరాబాద్‌లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల ప్రాంత గురుకులాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. వైద్యులు,ఇంజినీర్లు,శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పరిశోధకులుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.క్రీడలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, నల్లమల ప్రాంతంలో ఉన్న సహజ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి రావాలని ఆకాంక్షించారు. రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో నల్లమల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో మన్ననూరులోని పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదులు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలకు డార్మిటరీ,అదనపు తరగతి గదులు,స్టోరేజ్ సంప్,అచ్చంపేట,ఇనోల్,బాణాల,చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించగా,పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమం పారదర్శకంగా అమలు కావాలని, నల్లమల ప్రాంత అభివృద్ధిలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని మంత్రి సూచించారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...., అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నల్లమల్ల ముద్దుబిడ్డ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలోని చెంచు గిరిజనులు,దళితులు,వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్లమల గ్రామాలకు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు వేగంగా చేరుతున్నాయని తెలిపారు.రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా నల్లమల ప్రాంతంలో పర్యటించి గురుకుల విద్యాసంస్థలను సందర్శించడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, నాణ్యమైన ఆహారం,అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల్లో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.చెంచు గిరిజనుల కోసం రూ.1.80 కోట్లతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వివిధ ఉత్పత్తులు తదితర వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి,గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.నల్లమల ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి గిరిజన తండా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందే వరకు తమ కృషి కొనసాగుతుందని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఇఓ రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి ,ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నల్గొండ: రహదారి మూల మలుపులో గుంత.. వాహనదారులకు ముప్పు నల్గొండ: నల్గొండ పట్టణంలోని శివాజీనగర్–పానగల్ ప్రధాన రహదారిలో రామగిరి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని మూలమలుపు వద్ద ఏర్పడిన గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతను గుర్తించకపోతే అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని పట్టణవాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- నల్లగొండ మండలం కొత్త పల్లిగ్రామపంచాయతీ ఆరో వార్డు సమస్య ఉంది మోరి వాటర్ పోకుండా కట్టలు పోయడం జరిగింది ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న ప్రజలకు జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని కోరుతున్నాము1
- NGKL: బీచుపల్లి వద్ద నురగలు గక్కుతున్న కృష్ణమ్మ పరవళ్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బీచుపల్లి వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు విడుదల చేయడంతో నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బీచుపల్లి వంతెన వద్ద కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాలు పర్యాటకులను, ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జలకాలాడేందుకు నదిలోకి ఎవరూ దిగవద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం హెచ్చరించింది.2
- రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.1
- ములుగు జిల్లాలో రాకాసి గాలులు నేలకూలిన వందల వృక్షాలు.... ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 3-4 కి.మీ మేర వందలాది భారీ వృక్షాలు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే తరహాలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు.1