Shuru
Apke Nagar Ki App…
విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
AlluriMahesh
విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More news from Adilabad and nearby areas
- బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi3
- కవ్వాల్ టైగర్ జోన్.. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్న ప్రాంతం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే 'వేటగాళ్లకు అడ్డాగా' మారుతోంది. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఓ చిరుత పులిని అతి కిరాతకంగా చంపి, దాని గోళ్లను పీకేసిన ఘటన అటవీ అధికారుల వైఫల్యాన్ని ఎండగడుతోంది. ఘటన వెనుక విస్తుపోయే నిజాలు: ఊట్ల గ్రామానికి చెందిన మొత్తే వెంకటేష్, మొత్తే శ్రీనివాస్, మరియు పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్‌తో చిరుతను హతమార్చారు. కేవలం క్లచ్ వైరుతో ఉచ్చు వేసి, ఒక క్రూర మృగాన్ని హతమార్చగలిగారంటే.. ఆ ప్రాంతంలో అటవీ శాఖ నిఘా ఎంత 'ఘనం'గా ఉందో అర్థం చేసుకోవచ్చు. వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. వన్యప్రాణులపై లేదా? లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న బీట్ ఆఫీసర్ల నుంచి ఎఫ్.డి.ఓ, వరకు అందరిపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. నాలుగు రోజుల మౌనం: చిరుత చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితులు దాని అవయవాలను అమ్ముకోవడానికి బయలుదేరే వరకు అధికారులకు ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఫోన్లకు నో ఆన్సర్: వివరణ కోసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం? అవినీతి ఆరోపణలు: స్మగ్లర్లు, అక్రమ ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. "అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు?" అని మండల వాసులు, ప్రజా సంఘాల నేతలు నిలదీస్తున్నారు. తక్షణ డిమాండ్: సస్పెన్షన్ వేటు పడాల్సిందే! విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్లు, ఎఫ్.ఆర్.ఓ, మరియు ఎఫ్.డి.ఓ, లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు.2
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మళ్లీ 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మండలంలో రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అదే సమయంలో వేడి గాలులు సైతం వీయడంతో ఉక్క పోత వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధాన రోడ్డుతో పాటు చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు జన సంచారం లేక బోసిపోతున్నాయి.1
- కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.1
- గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.1
- పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.1
- ఇచ్చొడ మండలంలోని ఆడిగామ (బి) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శబరిమాత ఆలయం వద్ద నూతనంగా బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్తమే గ్రామంలో చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1